కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా విలయం.. తాజాగా 14వేలకు పైగా కేసులు, 36శాతం పెరిగిన పాజిటివిటీ రేటు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 14,502 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 21,95,136 గా వైద్య ఆరోగ్య శాఖా గణాంకాలలో తేలింది. మహమ్మారి వల్ల గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

ఏపీలో కరోనా కల్లోలం .. తాజా పరిస్థితి ఇలా

ఏపీలో కరోనా కల్లోలం .. తాజా పరిస్థితి ఇలా


రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,92,241 పాజిటివ్ కేసు లకు గాను 20,84,387 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ కాగా 14,549 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 93,305. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1728 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1610 కేసులు, ప్రకాశం జిల్లాలో 1597 కేసులు, కర్నూలు జిల్లాలో 1551 కేసులు, కడప జిల్లాలో 1492 కేసులు, నెల్లూరు జిల్లాలో 1198 కేసులు నమోదయినట్లు గా సమాచారం.

నలభై వేల పైచిలుకు పరీక్షలు, 14 వేల పై చిలుకు కరోనా కేసులు

నలభై వేల పైచిలుకు పరీక్షలు, 14 వేల పై చిలుకు కరోనా కేసులు


ఇక చిత్తూరు జిల్లాలో 685 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 941 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 846 కరోనా కేసులు, కృష్ణాజిల్లాలో 484 కరోనా కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 865 కరోనా కేసులు, విజయనగరం జిల్లాలో 862 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 643 కరోనా కేసులు నమోదయ్యాయి.గడచిన 24 గంటల్లో 40 వేల 266 నమూనాలను పరీక్షించగా 14 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో గత 24 గంటల్లో 4,800 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు.

లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు

లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు


ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 యాక్టివ్ కరోనా కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది. లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు ఉన్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన మొత్తం మృతుల సంఖ్య 14,549 గా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం లలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు 24 గంటల్లో మరణించారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 శాతానికి పాజిటివిటీ రేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 శాతానికి పాజిటివిటీ రేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 శాతానికి పాజిటివిటీ రేటు పెరిగింది . దీంతో ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గగా కొత్త కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా నమోదవుతోంది. కొన్ని జిల్లాలలో పాజిటివిటీ రేటు ఏకంగా 50 శాతానికి పెరిగింది. కరోనా కేసులు ఎన్ని పెరుగుదల నేపద్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కఠిన నిబంధనలను పాటిస్తున్నా సరే కేసుల జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది.


English summary
Corona cases rise continues in AP. It is a matter of concern that more than 14 thousand cases have been registered recently. Corona is throwing the claw at the AP with an increased positivity rate of 36 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X