coronavirus: ఆరోగ్య శ్రీ కింద కరోనా అనుమానితులకు వైద్యం, ప్రైవేట్ ఆస్పత్రులకు ఏపీ సర్కార్ ఆదేశం
కరోనా అని సస్పెక్ట్ చేసేవారికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఐసోలేషన్ వార్డుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు బుధవారం నాటి హెల్త్ బులిటెన్‌లో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. విదేశాల నుంచి ఏపీ 29 వేల మంది వచ్చారని.. మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయవాడలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అక్కడ మరిన్ని ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
కరోనా ఆస్పత్రుల్లో 2 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయనిజ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాపిడ్ టెస్టింగ్ పరికరాలను తెప్పిస్తున్నామని.. కరోనా పరీక్షల కోసం మరో మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు.జిల్లా కేంద్రాల్లో 200 ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
Recommended Video
312 మంది శాంపిళ్లను పరీక్షలకు పంపించాం. 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది, 60 మంది రిపోర్టుల నివేదికలు ఇంకా రాలేదని చెప్పారు. బుధవారం 13 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపించామని.. ఏపీలో విదేశాల నుంచి వచ్చిన 12,177 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. సబ్ డివిజన్ స్థాయిలో 17,837 ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉంచామని.. విశాఖ ఎయిర్‌పోర్టు, గంగవరం, కృష్ణపట్నం పోర్టులో ప్రయాణికులకు స్క్రీనింగ్ తప్పనిసరి అని జవహర్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications