వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో చంద్రబాబుది వన్‌ సైడ్‌ లవ్‌ - సరెండర్ అయ్యేందుకు : సీపీఐ నారాయణ..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు - బీజేపీ పొత్తు అంశం పైన సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ - బీజేపీ పొత్తు రాజకీయాల పైన కొద్ది రోజులుగా ఏపీలో అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగా 2014 ఎన్నికల తరహాలో టీడీపీ..బీజేపీ..జనసేన పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బీజేపీని కలుపుకొనే విధంగా టీడీపీ - జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి.

Recommended Video

జగన్ చేసిన సంక్షేమానికి మించి అంటూ....*AP Politics || Telugu OneIndia
గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు

గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు - ప్రధాని మోదీ మధ్య పలకరింపులు కొత్త చర్చలకు.. ఆశలకు కారణమయ్యాయి. ఈ పలకరింపుల పైన జనసేనాని స్పందించారు. మోదీ- చంద్రబాబు కలవరన్నారు.. కానీ, ఇప్పుడు కలిసారంటూ చెప్పుకొచ్చారు. పొత్తుల విషయంలో తాము ఇప్పుడే స్పందించమని చెప్పుకొచ్చారు. కానీ, జగన్ వ్యతిరేక ఓటు మాత్రం చీలనీయనని మరోసారి స్పష్టం చేసారు. ఈ సమయంలో ఈ పొత్తుల వ్యవహారం పైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేశారని గుర్తు చేసారు.

బీజేపీతో రాసుకొని తిరిగేందుకు

బీజేపీతో రాసుకొని తిరిగేందుకు

ఎన్నికలయిన తర్వాత బీజేపీకి చంద్రబాబు సరెండర్‌ అవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలు నిలకడగా ఉండాలని నారాయణ అభిప్రాయపడ్డారు. నిలకడలేని రాజకీయాలను ప్రజలను నమ్మరని పేర్కొన్నారు.

అదే సమయంలో బీజేపీతో చంద్రబాబు ది ఒన్ సైడ్ లవ్ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు. గతంలో కుప్పం పర్యటనలో జనసేనతో పొత్తు అంశం పైన చంద్రబాబు ఇదే తరహాలో ఒన్ సైడ్ లవ్ సరి కాదని, రెండు వైపుల నుంచి దీని పైన చర్చ జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీ మాత్రం టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.

ఆ రెండు పార్టీలు కలయికపై వైసీపీ

ఆ రెండు పార్టీలు కలయికపై వైసీపీ

ఇక..తాజాగా కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు సీఎం జగన్ ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో పోల్చుతూ వ్యాఖ్యలు చేసారు. దీని పైన స్పందించిన నారాయణ చంద్రబాబు జాతీయ రాజకీయాల పైన అవగాహన ఉందని, అంతర్జాతీయ రాజకీయాల పైన అవగాహన లోపానికి నిదర్శనంగా పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మూడో ప్రత్యామ్నాయం అవసరమంటూ చేసిన వ్యాఖ్యలతో ఆయన రూటు మారిందా అనే చర్చ మొదలైంది. కానీ, ఆ తరువాత పవన్..పొత్తుల పైన చేసిన వ్యాఖ్యలతో.. పొత్తులు ఉంటాయనేది పరోక్షంగా స్పష్టం చేసారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా..ఇప్పటికే అన్ని పార్టీల్లోనూ ఎన్నికల మూడ్ కనిపిస్తోంది.

English summary
CPI National Secretary Narayana key comments on TDP and BJP alliancem He says one side love from chandra Babu with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X