పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్‌ట్రా ప్లేయర్, ‘హోదా’ అంటే పంచలు తడుస్తున్నాయి: నారాయణ

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యంగ్యంగా స్పందించారు. కర్నూలులో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపిలో పవన్ కళ్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కరువు జిల్లాలను వెంటనే గుర్తించాలని నారాయణ ఈ సందర్భంగా ఏపి సిఎం చంద్రబాబునాయుడును డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం లాక్కోవడం సరికాదని ఆయన అన్నారు.

ఈ రోజు కార్టూన్

కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పంచెలు తడుస్తున్నాయని సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. కాగా, పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు భూ సేకరణను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.

CPI leader Narayana on Pawan Kalyan

ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో ప్రభుత్వం విఫలం: వైసిపి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావులు ఆరోపించారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఇసుక అక్రమరవాణాపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

మహిళా సంఘాల పేరుతో ఇసుక మాఫియా రూ. వెయ్యి కోట్లు దోచుకుందని వారు విమర్శించారు. కృష్ణాజిల్లా వనజాక్షిపై దాడి ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు అన్నారు.

కాగా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యలకు రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత సమాధానమిచ్చారు. ఇసుక్ర అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1200లకు పైగా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రూ. 4 కోట్ల 64 లక్షల వరకు జరిమానా విధించినట్లు చెప్పారు. అక్టోబర్ నుంచి ఇసుక రీచ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పీతల సుజాత వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+