విలాసవంతమైన భిక్షగత్తే కంగానా.. పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీ.. సోము వీర్రాజుపై నారాయణ సెటైర్లు
భారతీయ జనతా పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారన్నారు. పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీ అప్పగించారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టింస్తోందని విమర్శించారు. కంగానా రనౌత్ ఒక విలాసవంతమైన భిక్షగత్తే సంచలన వ్యాఖ్యలు చేశారు. .

విప్పి చూపించే కంగనాకు పద్మశ్రీనా..?
ప్రధాని మోదీ వచ్చిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్ర వచ్చిందని నోటకి ఇష్టం వచ్చినట్లు కంగానా రనౌత్ మాట్లాడుతుంని నారాయణ మండిపడ్డారు.. ఆ విలాసవంతమైన బిక్షగత్తే దారిలోనే బీజేపీ నేతలు నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. విప్పేసి చూపించే కంగనా రనౌత్ కు పద్మశ్రీ.. రైతులకు అండగా నిలిచే సాయపడే సోనుసూద్‌పై ఐటీ దాడులా అని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుని బీజేపీ పార్టీ కార్యాలయాలు కడుతుందని ఆరోపించారు. నోట్ల రద్దు సయంలో రెండున్నార లక్షల కోట్లు ధనాన్ని అక్రమంగా వెనుకేసుకున్నారని .. ఆ డబ్బుతోనే ఆఫీసులు లు కడుతున్నారన్నారని ఆరోపించారు.

పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీ..
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని వ్యాఖ్యానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై నారాయణ విమర్శలు గుప్పించారు. పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీని అప్పగించారంటూ వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు కాస్తా ఆయన ఇంటిపేరు సారాయిగా మారిపోయిందని సైటైర్లు వేశారు. సీపీఐ కార్యాలయాల గురించి మాట్లేడే అర్హత సోము వీర్రాజుకు లేదని హెచ్చరించారు. కమ్యూనిస్టులంటే ఎందుకు భయపడుతున్నారన్నారు. సోము వీర్రాజుకు ఈ నారాయణ దెబ్బ ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీని ఇంకా ఉరికిస్తామన్నారు .

చెప్పు నెత్తిమీద పెట్టుకునే పరిస్థితి..
విజయవాడలో మద్యంపై వ్యాఖ్యలు చేసి పరువు పోగొట్టుకున్న వీర్రాజు.. గుంటూరులో జిన్నా టవర్ వద్ద తన పరువు వెతుక్కుంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. మారాల్సింది పేర్లు కాదు.. బీజేపీ విధానాలన్నారు. మత విద్వేషాలను రెచ్చగోట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పులపై కూడా జీఎస్టీ విధించడం దారుణమన్నారు. ఈ జీఎస్టీ సామాన్యులపై బారం తప్ప మరొకటి కాదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్మకాస్తున్నారని విమర్శించారు. కాళ్లకు వేసుకునే చెప్పులను కూడా నెత్తిమీద పెట్టుకునే పరిస్థితి మోదీ తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీర్సీని కాస్త ఫే రివర్స్ కమిషన్‌గా మారింది.
ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు మొదలైందని నారాయణ విమర్శించారు. లోకల్ మాఫియాతో పోలీసులు వ్యవస్థ కలిసిపోయిందని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పీర్సీని కాస్త ఫే రివర్స్ కమిషన్ గా వైసీపీ మార్చేసిందన్నారు.. బీజేపీ నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడుతుంటే జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. జనవరి 26నుంచి సిపిఐ జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు..












Click it and Unblock the Notifications