బాబు వ్యాఖ్యల ఎఫెక్ట్: 'ఉప ఎన్నికల్లో డబ్బు పంచనని ప్రమాణం చేస్తారా'
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డబ్బులు పంచనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అమరావతి: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డబ్బులు పంచనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అభివృద్ధి చేస్తున్నామని, మా పాలన నచ్చకుంటే మేం వేసిన రోడ్లపై నడవవద్దని, ఓటుకు నేను రూ.5000 ఇవ్వగలనని, ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై రామకృష్ణ ఘాటుగా స్పందించారు. రోడ్లు వేసేది ప్రజల సొమ్ముతో అని, చంద్రబాబు సొంత సొమ్ముతో కాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను వెలివేసిన ఘటనపై సీఎం స్పందించాలని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామన్నారు.












Click it and Unblock the Notifications