న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ధర్నా
శ్రీకాకుళం: కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో సిపిఎం నేతలు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అణు విద్యుత్ ప్లాంట్ పెట్టొద్దంటూ ఆందోళనలు చేపడుతున్న సిపిఎం పార్టీ నేతలు 5 రోజుల పాటు కొవ్వాడ పరిసర గ్రామాలలో పాదయాత్ర నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఈయాత్రకి అనుమతి నిరాకరించిన పోలీసులు దానిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వామపక్ష పార్టీల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. పాదయాత్రకి సిద్దపడిన సిపిఎం రాష్ట్ర ,జిల్లా నేతలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.












Click it and Unblock the Notifications