వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి నేత ఇంట్లో క్రికెట్ కిట్స్, మద్యం బాటిళ్ల సీజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Cricket kits seized from TDP leader's house
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోలీసుల జరిపిన సోదాల్లో ఓ తెలుగుదేశం పార్టీ నేత ఇంట్లో క్రికెట్ కిట్లు లభించాయి. మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వరరావు ఇంట్లో క్రికెట్ కిట్లు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కేశినేని నాని, శ్రీరాంతాతయ్య ఫోటోలతో ఉన్న ఆరు క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు నేత ఇంట్లో ఉన్న చీరలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి అక్రమంగా తరలిస్తున్న పదివేల మద్యం బాటిళ్లను మంగళవారం అటవీ ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజుల పాడ్యం సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం లోడ్‌తో ఉన్న లారీ తారపడింది. పోలీసులను చూసిన డ్రైవర్ లారీని వేగంగా చిత్తూరుకు వైపుకు తరలించాడు. దీన్ని గుర్తించిన పోలీసులు లారీని వెంబడించి పాతకాల్వ వద్ద పట్టుకున్నారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.65 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. మంగళవారం ఉదయం వరంగల్‌లో జిల్లా కలెక్టరేట్‌లో ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయాన్ని భన్వర్‌లాల్ ప్రారంభించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తామని, రాష్ట్రానికి 352 కంపెనీల బలగాలు వచ్చాయని ఆయన తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 27న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు భన్వర్‌లాల్ వెల్లడించారు.

English summary
Cricket kits have been seized from a Telugudesam leader at Jaggayyapet in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X