హత్యకు రూ.15 లక్షల సుపారీ: పోలీస్ చేతికి చిక్కిన ముఠా

ముఠా సభ్యులను ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ముఠాను తమదైన శైలిలో విచారించారు. శశిధర్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసేందుకు తాము ఒకరి వద్ద నుంచి రూ.15 లక్షలు సుపారీ తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎవరు ఆ నగదు ఇచ్చారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
యజమాని ఇంట్లో ఉండగానే ఇంటిని తగులబెట్టారు..
మెదక్ జిల్లా పటాన్‌చెరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిని తగులబెట్టి, ఆ ఇంట్లో ఉన్న యజమానిని హత్య చేయాలని తలపెట్టారు. యజమాని ఇంట్లో ఉండగానే ఇంటికి తాళం వేసి కిటికీ వద్ద పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటించారు. తలుపులు బద్దలు కొట్టుకుని ఇంటి యజమాని బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. భూవివాదంతోనే తనపై హత్యాప్రయత్నం చేసినట్లు యజమాని చెప్పాడు.
గుంతలో పడిన కారు, ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లా కుంటాల మంలం తురాటి వద్ద మంగళవారం ఉదయం ఓ కారు అదుపు తప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నిర్మల్‌కు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications