విశాఖ నుంచి పాలన, కొత్త షెడ్యూల్ - ఎన్నికల వేళ కొత్త లెక్కలు..!!

విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్(CM Jagan) సిద్దం అవుతున్నారు. ఇందుకు దసరా మహుర్తంగా ఖరారు చేసారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం సిద్దమైంది. ఈ సమయంలోనే ముందుగా సీఎస్ జవహర్ రెడ్డి రెండు రోజుల విశాఖ పర్యటన కీలకంగా మారుతోంది. విశాఖ(Vizag) పరిపాలనా రాజధాని చేయాలనే ఆలోచనలకు న్యాయ పరమైన ఇబ్బందులు ఉండటంతో విశాఖ నుంచి పాలనకు వీలుగా షెడ్యూల్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

విశాఖ నుంచే పాలన : వచ్చే నెలలో విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ(Cabinet) సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. వారంలో రెండు రోజులు విశాఖ నుంచే ముఖ్యమంత్రి పాలనా వ్యవహారాలు కొనసాగించనున్నారు. ఆ సమయంలో అధికారిక సమీక్షలు చేపట్టనున్నారు.

CS Jawahar Reddy to visit Vizag for two days likely to finalise CMO and offices amid CM Jagan latest Decision

అదే విధంగా వచ్చే నెలలో మంత్రివర్గ సమావేశం కూడా విశాఖలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టు(Supreme Court) పరిధిలో ఉండటంతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విశాఖలో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది.

సీఎంఓ ఏర్పాటు : ప్రస్తుతానికి విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం(CM Camp Office) మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యలయాల తరలింపు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖలో కార్యాలయాల ఏర్పాటుపైన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. సీఎంతో పాటు ఉండే అధికార యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు ప్రారంభించారు జిల్లా అధికారులు.

రుషికొండ, సాగర్ నగర్, ఎండాడ తో పాటు సమీప ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీవిఎంసీ(GVMC)కి జాయింట్ కలెక్టర్ స్థాయి ఐఏఎస్ కమిషనర్‌గా ఉంటూ స్టేట్ సర్వీసెస్ కు చెందిన పలువురు అదనపు కమిషనర్‌లుగా ఉంటున్నారు. వారి స్థానంలో కార్యదర్శి స్థాయి కలిగిన సీనియర్ ఐఎఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించనున్నట్లు సమాచారం.

CS Jawahar Reddy to visit Vizag for two days likely to finalise CMO and offices amid CM Jagan latest Decision

వారంలో రెండు రోజులు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి(C Jawahar Reddy) విశాఖ వస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అని అధికారులు చెబుతున్నా అందుబాటులో ఉన్న భవనాలు, ఏర్పాట్లను సీఎస్ పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ(Visakha) పోలీసు కమిషనర్ పోస్టును అదనపు డీజీ హోదా అధికారికి కేటాయించారు.

సీఎస్ పర్యటనలో అనేక కార్యక్రమాలు ఉన్నా...సీఎం పాలన ప్రారంభించాలని నిర్ణయించటంతో ఈ అంశం పైన ఆరా తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో, మరో నెల రోజుల్లో విశాఖ కేంద్రంగా రాష్ట్ర పాలనా వ్యవహారాలు ప్రారంభం కావటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+