తీవ్ర వాయుగుండం: ఏపీలో రెండ్రోజులు భారీ వర్షాలు, సముద్రం అల్లకల్లోలం, జాలర్లకు హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

తీరంలో 55 కి.మీ వేగంతో గాలులు, రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
ఈ క్రమంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించింది.

అల్లకల్లోలంగా సముద్రం, జాలర్లకు హెచ్చరిక
అంతేగాక, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక ఆదివారం వరకూ జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అసలు మార్చి నెలల్లో బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం అరుదని.. గత 200 ఏళ్లలో ఇప్పటి వరకూ మార్చి నెలలో 11 సార్లు మాత్రమే తుఫాన్లు ఏర్పడ్డాయని వాతావరణ అధికారులు తెలిపారు.

1994 తర్వాత.. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు
ఇలా మార్చి నెలలో తుఫాన్ 1994లో తర్వాత ఇప్పుడే రావడమని తెలిపారు. అయితే ఈ ఇప్పుడు బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తక్కువగా ఉంటుందని తెలిపారు . ప్రస్తుతం ఈ వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Recommended Video

తమిళనాడు తీర ప్రాంతంలోనూ కల్లోలమే..
తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది. ఇది సాయంత్రం వరకు తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వ్యాపించనున్నాయి.
అంతేగాక, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక రేపటి వరకూ జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 13 కి.మీల వేగంతో వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications