హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ, టీలకు టాటా అండ: కేసీఆర్, బాబులతో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాటా గ్రూప్‌ చైర్మన్‌ సైరస్‌ మిస్ర్తీ బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అభివృద్ధిలో టాటాలు భాగస్వామ్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మిస్ర్తీ ప్రకటించారు. చంద్రబాబు దార్శనికతను ప్రశంసించిన మిస్ర్తీ, కెసిఆర్‌ రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం ముసాయిదాను కొనియాడారు. రెండు రాష్ట్రాలతో తమ గ్రూప్‌ అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకుంటుందని హామీ ఇచ్చారు.

అనేక అంశాల్లో మీకు మంచి దూరదృష్టి ఉందని, మీ దార్శనికత నచ్చిందని, మీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నామని మిస్ర్తీ చంద్రబాబుతో అన్నారు. ఈ ప్రశంసకు చంద్రబాబు కూడా అదే స్ధాయిలో ప్రతిస్పందించారు. తమది కొత్త రాష్ట్రమని, అనేక అంశాల్లో మంచి అనుభవం, ప్రావీణ్యం ఉన్న టాటా సంస్ధల్లో అనుభవజ్ఞులను తమ సలహా బృందంలో భాగం చేస్తే తమకు బాగా ఉపయోగపడుతుందని, మా చిత్తశుద్ధికి మీ నైపుణ్యం తోడు కావాలని చంద్రబాబు కోరారు. దీనికి మిస్త్రీ అంగీకరించారు.

ఎన్టీఆర్‌ సుజల పథకంపై ఆసక్తి వ్యక్తం చేశారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి టాటాల టెక్నాలజీ గురించి వివరిస్తూ, ప్లాంటు నిర్మాణ వ్యయాన్ని పక్కనపెడితే రెండు రూపాయలతో వంద లీటర్ల మినరల్‌ వాటర్‌ తయారు చేయవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ టెక్నాలజీ ఇచ్చేందుకు మిస్త్రీ అంగీకరించారు. ఎన్టీఆర్‌ సుజల పథకం కింద మంచినీటి ప్లాంట్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించే విషయం పరిశీలిస్తామన్నారు.

మధ్యప్రదేశ్‌లో తమ గ్రూప్‌ సంస్థ ర్యాలీస్‌ ఆధునిక సాగు పద్ధతులపై 50 వేల మంది రైతులకు సాంకేతిక సమాచారం ఇస్తోందని మిసీ్త్ర చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొలం పిలుస్తోంది.. కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకునేందుకు అంగీకరించారు. ఈ గవర్నెన్స్‌లో భాగంగా లక్షల మంది సాంఘిక భద్రత పింఛనుదార్లకు మొబైల్‌ ఫోన్ల ఆధారంగా పింఛన్‌ అందించే ప్రతిపాదనపై మిసీ్త్ర, చంద్రబాబు చర్చించారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణంలో పాలుపంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి కావాల్సిన సాంకేతిక సామర్ధ్యం తమ వద్ద ఉందని మిస్త్రీ చెప్పారు.

కేసీఆర్, మిస్త్రీ

కేసీఆర్, మిస్త్రీ

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో టాటా గ్రూప్‌ సంస్థలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టాటా గ్రూప్‌ చైర్మన్‌ మిస్త్రీని కోరారు.

 కేసీఆర్, మిస్త్రీ

కేసీఆర్, మిస్త్రీ

తెలంగాణ రాష్ట్రంలో అవలంబించబోయో పారిశ్రామిక విధానం ముసాయిదా చాలా బాగుందని, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ఆ విధానం ఎంతో దోహదపడుతుందని మిస్త్రీ చెప్పారు.

కేసీఆర్, మిస్త్రీ

కేసీఆర్, మిస్త్రీ

తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలూ, పథకాల గురించి వివరిస్తూ, విధానాల రూపకల్పనలో వ్యూహాల ఖరారు, అమలులో టాటా కన్సల్టెన్సీ భాగసామ్యం అవసరమని కెసిఆర్‌ చెప్పారు.

 కేసీఆర్, మిస్త్రీ

కేసీఆర్, మిస్త్రీ

సోలార్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ఖర్చుతో కూడుకున్నందున తక్కువ ఖర్చుతో యూనిట్ల స్థాపనకు టాటా గ్రూపు ఆలోచించాలని కెసిఆర్‌ కోరారు.

కేసీఆర్, మిస్త్రీ

కేసీఆర్, మిస్త్రీ

కేవలం పారిశ్రామిక, ఐటీ రంగాల్లోనే కాకుండా చాలా రంగాల్లో తమ గ్రూపు సంస్థలు పనిచేస్తున్నాయని, తమ అనుభవం, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మేధోపరమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని సైరస్‌ మిస్ర్తీ ప్రకటించారు.

 కేసీఆర్, మిస్త్రీ

కేసీఆర్, మిస్త్రీ

హైదరాబాద్‌ నగరాన్ని మురికి వాడలరహిత సిటీగా మార్చాలనే కెసిఆర్‌ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంచి కాలనీలు నిర్మించేందుకు, ఇప్పుడున్న స్లమ్స్‌లో మౌలిక వసతులు కల్పించి వాటి రూపురేఖలు మార్చేందుకు అవసరమైన విధానం, వ్యూహం ఖరారు చేసే విషయంలో తమకున్న అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తామని కెసిఆర్‌కు మిస్ర్తీ హామీ ఇచ్చారు.

చంద్రబాబు, మిస్త్రీ

చంద్రబాబు, మిస్త్రీ

అనేక అంశాల్లో మీకు మంచి దూరదృష్టి ఉందని, మీ దార్శనికత నచ్చిందని, మీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నామని మిస్ర్తీ చంద్రబాబుతో అన్నారు. ఈ ప్రశంసకు చంద్రబాబు కూడా అదే స్ధాయిలో ప్రతిస్పందించారు.

చంద్రబాబు, మిస్త్రీ

చంద్రబాబు, మిస్త్రీ

తమది కొత్త రాష్ట్రమని, అనేక అంశాల్లో మంచి అనుభవం, ప్రావీణ్యం ఉన్న టాటా సంస్ధల్లో అనుభవజ్ఞులను తమ సలహా బృందంలో భాగం చేస్తే తమకు బాగా ఉపయోగపడుతుందని, మా చిత్తశుద్ధికి మీ నైపుణ్యం తోడు కావాలని చంద్రబాబు కోరారు. దీనికి మిస్త్రీ అంగీకరించారు.

చంద్రబాబు, మిస్త్రీ

చంద్రబాబు, మిస్త్రీ

ఎన్టీఆర్‌ సుజల పథకంపై మిస్త్రీ ఆసక్తి వ్యక్తం చేశారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి టాటాల టెక్నాలజీ గురించి వివరిస్తూ, ప్లాంటు నిర్మాణ వ్యయాన్ని పక్కనపెడితే రెండు రూపాయలతో వంద లీటర్ల మినరల్‌ వాటర్‌ తయారు చేయవచ్చని చెప్పారు.

English summary
HYDERABAD: Tata Sons chairman Cyrus P Mistry today met the Chief Ministers of Andhra Pradesh and Telangana, separately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X