వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇబ్బంది పెట్టాలని లేదు: డిఎస్, కిరణ్‌పై సోనియాకు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

d srinivas
హైదరాబాద్/న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తమ పార్టీ అధిష్టానానికి ఏమాత్రం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా తమ పార్టీ తెలంగాణపై ముందుకు వెళ్తుందని చెప్పారు.

ఆయన ఈ రోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలను ఆమె దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

షర్మిల, బాబు యాత్రలపై బొత్స

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్రల పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం వేరుగా మండిపడ్డారు.

పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందన్నారు. దోచుకున్నది దాచుకునేందుకు, మరింత దోచుకోవడానికే ప్రతిపక్షాలు పాదయాత్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం, దోచుకునేందుకు యాత్రలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఆరుగురు కాదు..: రాయపాటి

తాను రేపటి ఎంపీల సమావేశాలకు హాజరు కావడం లేదని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు విజయవాడలో చెప్పారు. సమైక్యాంధ్ర కోసం కేవలం ఆరుగురు ఎంపీలు మాత్రమే రాజీనామా చేస్తే ఉపయోగం లేదని, అందరు చేస్తేనే వస్తానని చెప్పానని అన్నారు.

English summary
PCC former chief and MLC D Srinivas met AICC president Sonia Gandhi on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X