హైదరాబాద్‌లో దారుణం: డార్జిలింగ్ యువతిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: నగరంలో రాత్రి దారుణం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోన్న డార్జిలింగ్ యవతిపై ఆమె స్నేహితుడు మాజిద్ సహా ఏడుగరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
డార్జిలింగ్‌కు చెందిన యువతి ఏడాది క్రితం నగరానికి వచ్చిన యువతి హిమాయత్‌నగర్‌లోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలంగా యువతిని ఓయువకుడు వేధింపులకు గురిచేశాడు.

ఈ క్రమంలో ఆదివారం ఇంట్లోని నుంచి యువతిని తీసుకెళ్లిన యువకుడు తోటి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్ చేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో హిమాయత్‌నగర్‌లో వదిలిపెట్టాడు.
అక్కడ కూడా కొంతమంది యువకులు వెంటపడటం గమనించిన స్థానికులు వారి బారి నుంచి యువతిని రక్షించారు. ప్రస్తుతం బాధితురాలు కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణంపై యువతి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిర్భయ చట్టం కేసు నమోదు చేసిన పోలీసులు, లైంగికి దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications