వివేకా హత్యకు అక్కడే ఫిక్స్ చేసారు - డబ్బులు ఎవరిచ్చారంటే : దస్తగిరి వాంగ్మూలంలో...!!
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారుతోంది. అప్రూవర్ గా మారిన తరువాత ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. అందులో వివేకా హత్య కేసుకు సంబంధించి తేదీలతో సహా టైం ఫిక్స్ చేసిన అంశంతో..పాటు డబ్బులు అందించటం పైనా సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఆర్‌పీసీలోని సెక్షన్ 306(4)(ఏ) కింద పులివెందుల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. అందులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ప్రణాళిక రూపొందిందని చెప్పారు. 2019 మార్చి 1 నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉంటూ.. ఆయన ఎప్పుడు, ఎక్కడికి వెళుతున్నారనే విషయాల్ని సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో పాటు తనకూ చెప్పేవాడని తెలిపారు.

కోటి రూపాయాలు ఇచ్చారు
హత్య గురించి మాట్లాడిన తరువాత సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో..ఎవరిచ్చారని తాను ప్రశ్నించగా.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి ఇస్తే ఆయన నాకు ఇచ్చాడు అంటూ సునీల్ చెప్పిన అంశాన్ని వివరించారు. ఆ తరువాత తనను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లగా..ఆయన శివశంకర రెడ్డికి ఫోన్ చేశాడని చెప్పారు. ఆయన..ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయండి అంటూ చెప్పారని వివరించారు. ఒక, హత్య కేసు సీబీఐకి వెళ్లటంతో తాము భాస్కర్ రెడ్డి..శివ శంకర్ రెడ్డిని కలిసి..సీబీఐ చేతుల్లోకి విచారణ వెళ్లింది..తమ పరిస్థితి గురించి అడగ్గా.. ఇబ్బంది ఏం లేద..మేం చూసుకుంటామని చెప్పటంతో పాటుగా డబ్బులు ఏమైనా కావలంటే అడగండి..ఇస్తామన్నారని తన వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్నారు.

పేర్లు బయటపెట్టద్దని చెప్పారు
తనను విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసు ఇవ్వగా..తాను బయపురెడ్డి ఇంట్లో శివశంకర్‌రెడ్డిని కలిశానన్నారు. సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా మా పేర్లు బయటపెట్టకు. నీకు కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్ చేస్తామంటూ హామీ ఇచ్చిన విషయాన్ని దస్తగిరి వెల్లడించారు. తాను ఢిల్లీలోనే రెండున్నార నెలలున్నా.. సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదన్నారు. కడపలో సీబీఐ అధికారులు విచారించినప్పుడు వారితో నిజం చెప్పిన విషయాన్ని వెల్లడించారు. తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట అదే విషయమై వాంగ్మూలం ఇచ్చానన్నారు. ఎంపీ అవినాశ్ రమ్మంటున్నారంటూ ఓ రోజు భరత్ యాదవ్ నన్ను పిలిచాడని చెప్పారు. తాను వెళ్లలేదన్నారు. ఆ తర్వాత భరత్, పులివెందులకు చెందిన న్యాయవాది తనను న్యాయమూర్తి ఎదుట ఏం చెప్పావో వివరంగా చెప్పాలంటూ కోరారని వివరించారు.
Recommended Video


బెంగుళూరు భూ సెటిల్ మెంట్ పైనా వివాదం
తర్వాత పులివెందులలో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు నా వాంగ్మూలాన్ని బహిర్గతం చేశారని చెప్పారు. అప్పుడు భరత్ తన ఇంటికొచ్చి వాళ్ల మీద చెప్పి.. చాలా పెద్ద తప్పు చేశావ్... వాళ్లు నిన్ను వదలరంటూ చెప్పారని వివరించారు. దీంతో..తాను సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీకి లేఖ రాశానన్నారు. వివేకాను హత్య చేసిన రోజు రాత్రి గంగిరెడ్డి బెంగళూరు భూ వివాదం సెటిల్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులివ్వాలని వివేకాను అడిగారని చెప్పారు. అయితే, ఆ డబ్బులు ఎందుకు అడుగుతాంటూ వివేకా..ఆయనతో నీకు ఇచ్చేవైతే ఇచ్చేస్తాను కదా అంటూ సమాధానం ఇచ్చారని వివరించారు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి... అందులో గెలిస్తే నీకు డబ్బులిస్తా'' అని వివేకా గంగిరెడ్డితో అన్నారని దస్తగిరి పేర్కొన్నారు. వివేకాను అంతమొందించిన తర్వాత వై.ఎస్.రాజారెడ్డి ఆసుపత్రిలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లి తన దుస్తులపై పడిన రక్తపు మరకల్ని శుభ్రం చేసుకున్నట్లుగా దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications