వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరు నచ్చుతారు, నేను హీరోను, గెలుస్తా!: జగన్ ఆసక్తికరం, 'వైసీపీకి 137 స్థానాలు'

తాను విలన్ పైన పోరాటం చేస్తున్న హీరోను అని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

మీరు సినిమాకు వెళ్తే మీకు విలన్ నచ్చుతాడా, నా లాంటి హీరో నచ్చుతాడా ?

కర్నూలు: తాను విలన్ పైన పోరాటం చేస్తున్న హీరోను అని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.

అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్

జగన్ చేప్టిన యాత్ర బుధవారం 200 కిలో మీటర్లకు చేరుకుంది. డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో ఈ మైలు రాయి అందుకుంది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, యువత తరలి వస్తున్నారు.

బాలకృష్ణ వల్లేనా? బాబుకు తలనొప్పి: నంది అవార్డులు ఎవరికి, ఎలా సంబంధం?బాలకృష్ణ వల్లేనా? బాబుకు తలనొప్పి: నంది అవార్డులు ఎవరికి, ఎలా సంబంధం?

బాబు ప్రభుత్వం పతనం ఖాయం

బాబు ప్రభుత్వం పతనం ఖాయం

పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు హామీలు ఇస్తున్నారు. బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే రేషన్ కార్డుపై 9 సరుకులు ఇస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పతనం కావడం ఖాయమన్నారు.

137 స్థానాల్లో వైసీపీ విజయం

137 స్థానాల్లో వైసీపీ విజయం

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 137 స్థానాల్లో విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, తెస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.

నాకు వచ్చి చెబుతున్నారు, ఎంతో వ్యతిరేకత

నాకు వచ్చి చెబుతున్నారు, ఎంతో వ్యతిరేకత

పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి నవరత్నాల్లో మార్పులు చేసి ఎన్నికల మేనిఫెస్టోను రెండు మూడు పేజీల్లో విడుదల చేస్తానని జగన్ చెప్పారు. మీడియా మిత్రులు సలహాలు ఇవ్వవచ్చునన్నారు. నిరుద్యోగులు, యువత, మహిళలు నేరుగా నా వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారని, అంటే ఏ మేర ప్రజా వ్యతిరేకత ఉందో తెలుసుకోవచ్చునని చెప్పారు. బాబు ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు.

హీరోనే నచ్చుతాడు, నేను గెలుస్తా

హీరోనే నచ్చుతాడు, నేను గెలుస్తా

మీరు సినిమాకు వెళ్తే అబద్దాలు చెబుతూ, వెన్నుపోట్లు పొడుస్తూ, అన్యాయాలు, అక్రమాలు చేసే విలన్ మీకు నచ్చుతాడా లేక వాటిని ఎదుర్కొనే న్యాయంగా ఉండే హీరో నచ్చుతాడా అని జగన్ ప్రశ్నించారు. మనకు అన్యాయాన్ని ఎదిరించే హీరో నచ్చుతాడన్నారు. రాబోయే ఎన్నికల్లో హీరోలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పారు. వైసీపీని గెలిపించాలన్నారు. తాను సీఎంను అవుతానని చెప్పారు. తద్వారా తాను చంద్రబాబు అనే విలన్ పైన పోరాడుతున్న హీరోను అని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ ఎన్నో అబద్దాలు చెప్పారన్నారు.

మంచిగా పాలించి 2024లో మళ్లీ మీ ముందుకు వస్తా

మంచిగా పాలించి 2024లో మళ్లీ మీ ముందుకు వస్తా

ప్రజల ఆదరాభిమానాలతో ఏడాదిలో పాలన పగ్గాలు చేపడతామని, వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను తప్పకుండా అమలు చేస్తామని జగన్ చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలనను అందించి తిరిగి 2024 ఎన్నికలకు ప్రజల ముందుకు వస్తామన్నారు.

English summary
YSR Congress Party president YS Jagan Mohan Reddy said on Tuesday that any government that cheats its own people would witness a downfall.Speaking to reporters during lunch break at Betamcherla mandal headquarters village in Dhone Assembly segment in Kurnool district, Jagan Mohan Reddy alleged that Chief Minister N. Chandrababu Naidu was in the habit of deceiving people for political gains, and that the days of the “tyrannical government” were numbered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X