టిపై స్పీకర్ చెప్పారని కిరణ్: డిఎస్ రాయలకు ఏరాసు...
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లులోని మార్పులు, చేర్పులపై సభాపతి నాదెండ్ల మనోహర్ అభిప్రాయాలు కోరారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం చెప్పారు. టి బిల్లుపై శుక్రవారం లోగా సభ్యులు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ బిఏసిలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయమై కిరణ్ మాట్లాడుతూ... మార్పులు, చేర్పులపై స్పీకర్ అభిప్రాయాలు కోరారన్నారు. ప్రతి అంశం పైన చర్చ, ఓటింగ్ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.
సమావేశాల్లో స్వల్ప మార్పులు
శాసన సభ సమావేశాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 16వ తేదీన పండుగ ఉండటంతో ఆ రోజు నుండి ప్రారంభం కావాల్సిన సమావేశాలు 17 నుండి ప్రారంభమవుతాయి. ఈ నెల 18వ తేదీన శనివారం కూడా శాసన సభ సమావేశం ఉంటుంది.

లాబీల్లో ఆసక్తికర చర్చ
అసెంబ్లీ లాబీల్లో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్‌ల మధ్య సోమవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాయల తెలంగాణ ప్రతిపాదనలో న్యాయముందని డిఎస్ అనగా, ఏరాసు అందుకు తాము సమ్మతమేనని చెప్పారు.
కర్నూలులో నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు తమ నీటిని అనంతపురంవాసులు తరలించుకుపోతున్నారని, విభజన కారణంగా తమలో తాము కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఏరాసు ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకు డిఎస్ మాట్లాడుతూ... మీ ఆస్తులన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి కదా అనగా, కర్నూలులో వ్యవసాయం ఉందని ఏరాసు సమాధానమిచ్చారు. ఇదే సమయంలో జెసి మాట్లాడుతూ.. తాను పార్టీలో ఉంటానంటుంటే మీరు మాత్రం పోపో అంటున్నారని వారితో వ్యాఖ్యానించారు. తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాగో.. బాగోల వల్లనే ఈ కష్టాలని ఏరాసు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications