చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్థాయిలో నిర్ణయం.. సినీ కార్మికుల సమ్మెపై ఏపీ మంత్రి కీలకవ్యాఖ్యలు!

వేతనాల పెంపునకు సంబంధించి నిర్మాతలతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. వేతనాల పెంపుపై ఇరువర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా గత శుక్రవారం నుంచే షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది.

నిలిచిపోయిన షూటింగ్ లు, ఏపీ మంత్రితో సినీ నిర్మాతల భేటీ
తాజాగా ఫెడరేషన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ లో అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఇప్పటికే షెడ్యూల్ చేసిన షూటింగులను పూర్తిచేసేందుకు రెండ్రోజుల సమయం కేటాయిస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు.

Decision at Chandrababu and Pawan Kalyan level AP Minister key comments on the film workers strike

సినీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వ పాత్ర ఉండదన్న మంత్రి కందుల దుర్గేశ్
సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళన పై మంత్రి దుర్గేష్ కు వినతిపత్రం ఇచ్చారు. భేటీ అనంతరం మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్ సినీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వ పాత్ర ఉండదని ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ కు సంబంధించిన వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ కు ,ఫెడరేషన్ కు మధ్య చర్చల ద్వారానే ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.

నిర్మాతలతో భేటీలో ప్రత్యేక అజెండా లేదు
ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దృష్టికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ వ్యవహారాన్ని, నిర్మాతల అభిప్రాయాలను తీసుకువెళతామని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు.. రమ్మన్నాం.. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని తెలిపిన మంత్రి దుర్గేష్ ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, సినీ నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలు వింటాం అని పేర్కొన్నారు.

అవసరం అయితే సీఎం, డిప్యూటీ సీఎంల స్థాయిలో నిర్ణయం
ఈ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం అవసరం అయితే సీఎం, డిప్యూటీ సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం అని పేర్కొన్నారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం అని మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమ స్థిరపడాలనేది తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+