అర్దరాత్రి జేసీబీలతో ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత; వైసీపీ బరితెగింపని టీడీపీ ఆగ్రహం!!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మాజీ టీడీపీ ఎంపీ ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్క్ లో కొందరు వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. దివంగత టీడీపీ నేత కింజారపు ఎర్రన్నాయుడు పేరుతో నిర్మితమవుతున్న చిన్నారుల పార్కును కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. అర్ధరాత్రి వేళ నరసన్నపేట లోని చిల్డ్రన్ పార్క్ లో ఒక వైపు ఉన్న ప్రహరీ గోడను జెసిబి లతో కూల్చివేశారు కొందరు దుండగులు.

అర్దరాత్రి జేసీబీలతో ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత

అర్దరాత్రి జేసీబీలతో ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత

అర్ధరాత్రి రెండు జెసిబి లతో పార్కు వద్దకు చేరుకుని, నిర్మాణ దశలో ఉన్న పార్కును కూల్చివేశారు. విషయం తెలిసి అక్కడికి చేరుకుని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగి పార్కు కూల్చివేతను అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేతపై మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. వైసిపి స్థానిక వార్డు సభ్యుడు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు అంటూ పేర్కొన్నారు.

అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై దాడికి యత్నం.. టీడీపీ ఆందోళన

అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై దాడికి యత్నం.. టీడీపీ ఆందోళన


పార్కులో శబ్దాలు వినగానే స్థానికులు టిడిపి నేతలకు సమాచారం ఇచ్చారని టిడిపి నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేసి అక్కడి నుంచి అక్రమార్కులు పరారయ్యారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఎర్రన్నాయుడు స్మారక పిల్లల పార్కు కూల్చివేత ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నేతృత్వంలో ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు ఈ ఘటనలో వైసీపీ శ్రేణుల హస్తం ఉందని తక్షణం వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు.

చిల్డ్రన్స్ పార్క్ స్థలంపై వివాదం..

చిల్డ్రన్స్ పార్క్ స్థలంపై వివాదం..

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో దాదాపు రెండు కోట్ల వ్యయంతో నరసన్నపేట లోని ఇందిరా నగర్ కాలనీలో ఎర్రన్నాయుడు పేరిట చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గ్రామపంచాయతీ నుండి ముప్పై నాలుగు లక్షల రూపాయల నిధులు ఇందుకోసం విడుదల కాగా, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చిల్డ్రన్ పార్క్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ స్థలంపై వివాదం చెలరేగడంతో కొంత మేర సాగిన పార్కు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

కోర్టు కేసు నేపధ్యంలో నిలిచిపోయిన చిల్డ్రన్స్ పార్క్ పనులు.. వైసీపీ పనే అంటూ ఆరోపణ

కోర్టు కేసు నేపధ్యంలో నిలిచిపోయిన చిల్డ్రన్స్ పార్క్ పనులు.. వైసీపీ పనే అంటూ ఆరోపణ

ఈ స్థలం కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ చెందిందని, గతంలో తమకు కేటాయించినట్లుగా కొందరు పేర్కొంటున్నారు. తమకు కేటాయించిన స్థలంలో చిల్డ్రన్ పార్క్ ఎలా కడతారని నిర్మాణాలను అడ్డుకోవడం కోసం 15 మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పనులు కోర్టు కేసు నేపథ్యంలో ఆగిపోయాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసిపి నేతల ప్రమేయంతోనే ఈ విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+