చంద్రబాబు, లోకేష్ ఒంటరిగా ఆ పని చేస్తే .. బాబు ఇంట్లో పాచి పని చేస్తానన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఏపి డిప్యూటీ సీఎం కే. నారాయణ స్వామి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై, నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒంటరిగా నిలబడి ఒక్కస్థానం గెలిస్తే తాను చంద్రబాబు ఇంట్లో పాచి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.

చంద్రబాబుకు జగన్ కు వ్యత్యాసం ఇదే

చంద్రబాబుకు జగన్ కు వ్యత్యాసం ఇదే

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్న డిప్యూటీ సీఎం కే నారాయణ స్వామి చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళ కోసం తపన పడతారని, అదే సీఎం జగన్ మాత్రం లేని వాళ్ల కోసం తపన పడతారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈరోజు ఎస్సీలపై లేనిపోని ప్రేమ ఒలక బోస్తున్నారని, అసలు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని ఆయన ధ్వజమెత్తారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి రెడ్లకు మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు నారాయణ స్వామి. కనీసం ఒక ఎస్సీకైనా అవకాశం కల్పించారా అంటూ ప్రశ్నించారు.

తాను అవినీతిపరుడు అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

తాను అవినీతిపరుడు అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

ఇక తాను అవినీతిపరుడనని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తనను తెలుగుదేశం పార్టీలోకి లాక్కోవడానికి రకరకాలుగా ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఎంతమంది ద్వారా తనతో చంద్రబాబు బేరసారాలు చేశాడని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. తాను డబ్బులకు, పదవులకు లొంగే వ్యక్తిని కాదనే విషయాన్ని అప్పట్లోనే నిరూపించానని గుర్తుచేశారు నారాయణస్వామి.

చంద్రబాబును టార్గెట్ చేస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ రివర్స్ ఎటాక్

చంద్రబాబును టార్గెట్ చేస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ రివర్స్ ఎటాక్

చంద్రబాబుకు, లోకేష్ కు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేదని, ఒకవేళ వాళ్లలో ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే తాను చంద్రబాబు ఇంట్లో పాచి పని చేయడానికైనా సిద్ధం అంటూ సవాల్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబుపై ఏపి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇటీవల చేస్తున్న విమర్శలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి నారాయణ స్వామి అవినీతి చిట్టా త్వరలో బయటపెడతానని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అవినీతి పరులను కట్టడి చేయాలని సలహా ఇస్తే తనపైనే అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారని, అయినా భయపడేది లేదని తేల్చి చెప్పారు.

మరోమారు నారాయణ స్వామి చంద్రబాబుపై ధ్వజం

మరోమారు నారాయణ స్వామి చంద్రబాబుపై ధ్వజం

చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు డిప్యూటీ సీఎం కే నారాయణ స్వామికి లేదని విమర్శించారు. దళిత నాయకుడిగా ఉన్న నారాయణస్వామి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వంగి వంగి నమస్కరించే వారని మండిపడ్డారు. కె. నారాయణ స్వామి టిడిపి వర్గాలను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో మాట్లాడిన టిడిపి నాయకుడు సుధాకర్ రెడ్డి తదుపరి ఎన్నికల్లో నెల్లూరు నుండి నారాయణ స్వామి గెలిచే అవకాశం లేదని ప్రకటించారు. తన అక్రమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టిడిపి నేత వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోమారు నారాయణస్వామి చంద్రబాబుపై ధ్వజమెత్తి సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+