వివాదాస్పద ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ ట్రీట్మెంట్..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డ్యూటీ ఎక్కారు. వివాదాస్పద ఎమ్మెల్యేలకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి.. వివాదాల్లో చిక్కుకున్న వారి పైన ఇప్పటికే పవన్ నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పుడు నేరుగా వారిని పిలిపించి మాట్లాడారు... ఒక ఎమ్మెల్యేలతో విప్ పదవికి రాజీనామా చేయించిన పవన్.. మరొకరి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకొని.. నాలుగు వారాల సమయం ఇచ్చారు. ఇదే సమయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం పార్టీలో సంచలనంగా మారింది.
డిప్యూటీ సీఎం పవన్ రూటు మార్చారు. తమపై వస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు - రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, అలాగే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వేర్వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. చిర్రి బాలరాజు పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పార్టీ దృష్టికి వచ్చిన పలు ఆరోపణలు, అంతర్గత విషయాలపై పవన్ ఆయనను సూటిగా వివరణ కోరారు. తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం కావాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరగా.. అందుకు స్పందించిన పవన్ కళ్యాణ్, నాలుగు వారాల (నెల రోజులు) లోగా తన వ్యక్తిగత విషయాలన్నింటినీ పూర్తిగా చక్కదిద్దుకోవాలని తేల్చి చెప్పారు. మార్పు రాకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాలతో పాటు పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనుల మందగమనంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ వరుస నిర్ణయాలతో
పోలవరం నియోజకవర్గంలో పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 147 కోట్లు భారీగా కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత నిధులు ఉన్నప్పటికీ పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం, సకాలంలో పనులు వేగంగా పూర్తి చేయకపోవడంపై ఎమ్మెల్యే బాలరాజును పవన్ గట్టిగా ప్రశ్నించారు. అదే విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షునికి అందజేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా హర్ష వీణ అనే మహిళ తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ మోసం చేశారంటూ చేసిన ఆరోపణలు, నమోదైన కేసులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. వీటితో పాటు మరికొన్ని రాజకీయ ఆరోపణలు కూడా రావడంతో, ఆయన నైతిక బాధ్యత వహిస్తూ వ్యక్తిగత కారణాల చేత విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భేటీలో తనపై వచ్చిన వివాదాలపై ఆయన పవన్‌కు వివరణ ఇచ్చుకున్నారు. దీని ద్వారా పవన్.. ఇక పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేస్తానని.. గీత దాటిన వారి పైన కఠినంగా ఉంటానని కొద్ది రోజుల క్రితం చెప్పారు. అదే విధంగా ఇప్పుడు కార్యాచరణ.. చర్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.













Click it and Unblock the Notifications