TTD: తిరుమలలో సాక్షియాజమాన్యంపై ఎఫ్ఐఆర్, జగన్ కు షాక్ ఇచ్చిన టీటీడీ
తిరుమలలో బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్లారు. 5వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంలో పలు అంశాలపై టీటీడీ అధికారులు, వివిద శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
టీటీడీ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను పక్కనపెట్టి అసత్య కథనాలు ప్రచురించి శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాక్షి యాజమాన్యం పై ఫిర్యాదు చేశారు. శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకొని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో కొన్ని శాఖల అధికారులు కూడా ఆ సమావేశానికి హాజరు అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష పై ఈనెల ఆరవ తేదీన సాక్షి దినపత్రికలో ఒక కథనం ప్రచురితమైందని శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు లేనిపోనివి చెప్పారని సాక్షిలో వార్త వచ్చిందని, తాను చెప్పినట్లు మీరు వినాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు చెప్పలేదని, సాక్షి దినపత్రికలో తప్పుడు కథనం ప్రచురితమైందని, ఈ వార్త కారణంగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా పాక్షి యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపిస్తూ శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు చెప్పని విషయాలను చెప్పినట్లు సాక్షి దినపత్రికలో వచ్చిందని, శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా సాక్షి దిన పత్రికలో కథనం వచ్చిందని, వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం సాక్షి యాజమాన్యంపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో సాక్షి దినపత్రిక యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications