పవన్ కు వైరల్ ఫీవర్..! అలాగే అసెంబ్లీకీ, సమీక్షలకూ..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు తాజాగా వైరల్ ఫీవర్ సోకింది. దీంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు వైరల్ ఫీవర్ రావడంతో చికిత్స తీసుకుంటూనే ఆయన సమావేశాలకు హాజరవుతున్నారు. అలాగే అధికారులతో సమీక్షలకు కూడా హాజరవుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని జనసేన పార్టీ తెలిపింది. పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారని వెల్లడించింది. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని, అధికారులతో సమీక్షలు నిర్వహించారని తెలిపింది. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది.

డాక్టర్లు పవన్ కళ్యాణ్ కు విశ్రాంతి అవసరమని సూచించారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. జ్వరంతో ఇబ్బందిపడుతూనే పవన్ శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారని వెల్లడించింది. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాలు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చురుగ్గా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇలా జ్వరం బారిన పడటంతో అభిమానుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications