గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం రచ్చ .. భగ్గుమంటున్న టీడీపీ, మండిపడిన నందమూరి రామకృష్ణ

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రచ్చగా మారింది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేందుకు పట్టపగలే ఓ వ్యక్తి ప్రయత్నించాడని, అతను ఓ వైసీపీ కార్యకర్త అని తీవ్ర కలకలం రేపింది. ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసానికి యత్నించిన నేపథ్యంలో టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వైసిపి నేతలపై, వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. దీంతో పోలీసులు దుర్గిలో 144సెక్షన్‌ విధించారు. ముందస్తుగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం .. ధర్నా చేస్తున్న టీడీపీ నేతల అరెస్ట్, మండిపడిన టీడీపీ

ఇదిలా ఉంటే దుర్గి ఘటన తర్వాత మళ్ళీ గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పైన కూడా దాడి జరిగిందంటూ టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.కారంపూడి వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నేత చిరుమామిళ్ల మధుబాబు, ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తే చర్యలు ఉండవు, బీపీలు పెరిగిపోయి టీడీపీ కార్యాలయంపై దాడులు చేస్తే చర్యలు ఉండవు... కానీ ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేస్తారు మన పోలీసులు అంటూ తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు.

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు విగ్రహ ధ్వంసాలు అంటూ ఆగ్రహం

మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు తెదేపా నేతల అరెస్టుని తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం పార్టీ అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇదే సమయంలో ప్ర‌భుత్వం అవినీతి, అరాచ‌కాల‌తో ఆగ్ర‌హంగా ఉన్న ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు...కుల‌,మ‌త‌,ప్రాంత విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు వైసీపీ విగ్ర‌హాల ధ్వంసానికి పాల్ప‌డటం చాలా దుర్మార్గం అంటూ టీడీపీ ధ్వజమెత్తింది. రోజుకోచోట తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు,మహానాయ‌కులు దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామారావు విగ్ర‌హాల్ని ధ్వంసం చేస్తూ వికృతానందం పొందుతున్నారు వైసీపీ గూండాలు అంటూ విరుచుకు పడింది.

ఎన్టీఆర్ విగ్రహంపై దాడి వైసీపీ మూక‌ల అరాచ‌కానికి ప‌రాకాష్ట‌

ఎన్టీఆర్ విగ్రహంపై దాడి వైసీపీ మూక‌ల అరాచ‌కానికి ప‌రాకాష్ట‌

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న ఎన్టీఆర్ విగ్రహంపై దాడి వైసీపీ మూక‌ల అరాచ‌కానికి ప‌రాకాష్ట‌ అని పేర్కొంది.నిన్న దుర్గి, నేడు తాడికొండ‌. ఎన్ని విగ్ర‌హాలు ధ్వంసం చేసినా ప్ర‌జ‌ల గుండెలనుంచి అన్న‌గారిని తొల‌గించ‌లేరు అని స్పష్టం చేసింది . మ‌హ‌నీయుల విగ్ర‌హాల ధ్వంసంతో విద్వేష‌రాజ‌కీయాలు న‌డుపుతోన్న వైసీపీ తీరుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేస్తున్న ఘటనపై స్పందించిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఇది దారుణమని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం అంటే తెలుగు జాతిని అవమానించడమే అన్న నందమూరి రామకృష్ణ

ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం అంటే తెలుగు జాతిని అవమానించడమే అన్న నందమూరి రామకృష్ణ

తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునరుజ్జీవింప చేసిన నందమూరి తారక రామారావు మహా పురుషుడని, ఆ మహాపురుషుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే తెలుగు జాతిని అవమానించడమేనని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలని, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలపై చేయివేస్తే తెలుగుజాతి ఊరుకోదు అంటూ నందమూరి రామకృష్ణ తేల్చిచెప్పారు.

English summary
The TDP is upset over the incidents of attempting to destroy NTR statues in Durgi village in Guntur district, as well as at the Tadikonda police station. Nandamuri Ramakrishna became on fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X