'బ్రీఫ్ కేసు కంపెనీల దిద్దుబాటుకే కోల్‌కతాకు జగన్'

ఆర్థిక నేరాల నుండి బయటపడేందుకే జగన్ సమైక్యం ముసుగులో కోల్‌కతా వెళ్లారన్నారు. అక్కడి తన సూటుకేసు కంపెనీలను సరిదిద్దికునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఐటి, ఈడిలు వీటిపై విచారణ చేయకుండా ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోరోగ్ ప్రచారంపై దేవినేని స్పందించారు. అసెంబ్లీని కిరణ్ ఇన్నాళ్లు ప్రోరోగ్ చేయకుండా నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కిరణ్ తన నివేదికలో చెప్పకనే చెప్పారన్నారు.
బెయిల్ ఇప్పించింది: గాలి
వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించింది అధికార కాంగ్రెసు పార్టీయేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
శశికుమార్‌కు రక్షణ కల్పించాలి: సిఎం రమేష్
గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో శశి కుమార్‌కు రక్షణ కల్పించాలని టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ డిమాండ్ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి పైన పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని శశికుమార్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications