దేవినేని ఉమ అరెస్ట్.. అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు: దేవినేని, యనమల ధ్వజం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం గా మారింది. తెలుగుదేశం పార్టీ నేతలు అర్ధరాత్రి సమయంలో అశోక్ బాబు అరెస్టుపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కక్ష సాధింపు ధోరణికి అశోక్ బాబు అరెస్టు ఒక ఉదాహరణ అని పేర్కొంటున్నారు.

 అశోక్ బాబును కలవటానికి వెళ్ళిన దేవినేని ఉమా.. పోలీసులతో వాగ్వాదం

అశోక్ బాబును కలవటానికి వెళ్ళిన దేవినేని ఉమా.. పోలీసులతో వాగ్వాదం

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబును గురువారం రాత్రి సిఐడి పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో అశోక్ బాబును పరామర్శించడానికి సిఐడి కార్యాలయానికి దేవినేని ఉమ వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అశోక్ బాబు ని కలవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో దేవినేని ఉమా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతల అరెస్ట్

మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతల అరెస్ట్

మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటుగా, అశోక్ బాబు ని కలవడానికి వెళ్లిన టిడిపి నేతలు పిల్లి మాణిక్యాలరావు, బుచ్చి రాంప్రసాద్, కోవెలమూడి రవీంద్ర, సుఖవాసి, కనపర్తి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ బాబును అరెస్ట్ చేయడంపై, అలాగే సిఐడి కార్యాలయంలోకి అనుమతించకపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు. రఘురామకృష్ణం రాజును కొట్టినట్టు అశోక్ బాబు సైతం కొట్టారని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు

 శుక్రవారం నాడు అరెస్టులు చేసి కక్ష సాధింపులు : దేవినేని ఉమా

శుక్రవారం నాడు అరెస్టులు చేసి కక్ష సాధింపులు : దేవినేని ఉమా

అశోక్ బాబు పై దాడి చేస్తారా? తప్పుడు కేసులతో వేధిస్తారా? అంటూ పోలీసులపై దేవినేని ఉమ మండిపడ్డారు. అశోక్ బాబు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే ముందస్తు బెయిల్ తీసుకోలేదని దేవినేని ఉమ పేర్కొన్నారు. కావాలని శుక్రవారం నాడు అరెస్టులు చేసి ఈ ప్రభుత్వం టీడీపీ నేతల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి అధికారులు కావాలనే అశోక్ బాబు పై అక్రమ కేసులు బనాయించారని దేవినేని ఉమా మండిపడ్డారు.

 అశోక్ బాబు పై అక్రమ కేసులు బనాయించడం కుట్రపూరితం కాదా: యనమల

అశోక్ బాబు పై అక్రమ కేసులు బనాయించడం కుట్రపూరితం కాదా: యనమల

ఇదిలా ఉంటే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అశోక్ బాబును అరెస్ట్ చేయడంపై ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఉద్యోగులకు పిఆర్సిపై ప్రశ్నించినందుకు కక్ష సాధింపులో భాగంగా టీడీపీ నేత అశోక్ బాబును సిఐడి అధికారులు అరెస్టు చేశారని యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలోనే అశోక్ బాబు పై అక్రమ కేసులు బనాయించడం కుట్రపూరితం కాదా అంటూ ప్రశ్నించారు

తమ వైఫల్యాల నుండి దృష్టి మళ్లించటం కోసమే అశోక్ బాబు అరెస్ట్ : యనమల

తమ వైఫల్యాల నుండి దృష్టి మళ్లించటం కోసమే అశోక్ బాబు అరెస్ట్ : యనమల

అశోక్ బాబు విషయంలో ముగిసిపోయిన అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చి తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ సర్కార్ చూస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీల నేతల పై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఆయన రాక్షసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో అరెస్టుల ద్వారా ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తక్షణం అశోక్ బాబును విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+