'విదేశాల నుంచి వచ్చాక జగన్ ఏదో ఒకటి చేయాలిగా, జేసీ చెప్పినట్లు చేస్తాం'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ పక్క రాష్ట్రాన్ని రెచ్చగొడుతోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ పక్క రాష్ట్రాన్ని రెచ్చగొడుతోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.

విదేశాల నుంచి వచ్చాక ఏదో చేయాలనే జగన్ ధర్నా

విదేశాల నుంచి వచ్చాక ఏదో చేయాలనే జగన్ ధర్నా

రాయలసీమ దాహార్తి తీర్చేందుకు శ్రీశైలం నీటిని వాడుతుంటే వైసిపి అడ్డుకుంటోందని దేవినేని విమర్శించారు. ఓ పక్క రాయలసీమకు నీరు ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ, మరో పక్క నీరు ఇవ్వడం లేదంటూ ధర్నా చేస్తారని విమర్శించారు. జగన్ విదేశాల నుంచి వచ్చాక ఏదోటి చెయ్యాలని ధర్నా చేపట్టారని ఎద్దేవా చేశారు.

జగన్ చెంపలేసుకుంటాడా?

జగన్ చెంపలేసుకుంటాడా?

పట్టిసీమ ప్రాజెక్టు దండగన్న జగన్‌ ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెబుతాడా లేక చెంపలు వేసుకుంటాడా చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో ఇప్పటి వరకు పది లక్షల ఎకరాల్లో వరి పండిందన్నారు.

రెచ్చగొట్టేలా సాక్షి రాతలు

రెచ్చగొట్టేలా సాక్షి రాతలు

ఆక్వా పరిశ్రమకు మరో రెండు లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని దేవినేని చెప్పారు. 865 అడుగులకు శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణమ్మ చేరితే, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీకు నీళ్లు ఇస్తుంటే, ఆ నీటిని తోడేస్తున్నామని పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టేలా సాక్షి వార్తలు రాస్తోందన్నారు.

జగన్ ధర్నా చేస్తానంటారు

జగన్ ధర్నా చేస్తానంటారు

కడపకు ఒకటో తేదీలోపు సాగు నీరు ఇవ్వకపోతే ధర్నా చేస్తానని చెబుతూ, మరోపక్క పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టేలా వార్తలు రాస్తున్నారని దేవినేని ఆరోపించారు.

జేసీ చెప్పినట్లు చేస్తాం

జేసీ చెప్పినట్లు చేస్తాం

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోరినట్టు చాగల్లు రిజర్వాయర్‌ నుంచి మెట్ట ప్రాంతాలకు నీరు విడుదల చేసే విషయంపై త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. జగన్‌కు డేరాబాబా గతే పట్టబోతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. డేరాబాబా చేసిన పాపాలకు 20ఏళ్ల శిక్ష వేశారు. జగన్‌ చేసిన పాపాలకు 60 ఏళ్లు శిక్ష వేసినా తక్కువే అన్నారు. చంద్రబాబు ఆహారపు అలవాట్లను కూడా రాజకీయం చేయడం వైసీపీ నేతలకే చెల్లిందని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+