మీరంతా రావాల్సిందే: చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు షాక్, ఆ ముగ్గురికి రిలీఫ్
Recommended Video

అమరావతి/హైదరాబాద్/ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టు కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం (21-09-2018) విచారణ జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారు కోర్టుకు రావాల్సిందేనని న్యాయస్థానం ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చింది.
కోర్టుకు హాజరైన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బెయిల్ లభించింది. తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, కేఎస్ రత్నంలకు బెయిల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.

కోర్టుకు రావాల్సిందే
చంద్రబాబు తరఫు న్యాయవాదులు నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు కోరుతూ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు కోర్టుకు హాజరయ్యేందుకు సమయం లేనందున తన న్యాయవాదిని పంపించారు చంద్రబాబు. చంద్రబాబు తరఫున లాయర్ జీ సుబ్బారావు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నోటీసులు అందుకున్న వారు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.

చంద్రబాబు సహా 16 మందికి
చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

నాడు ఏం జరిగిందంటే?
2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అప్పుడు పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

బలవంతంగా తరలింపు
బార్డర్ దాటడంతో మహారాష్ట్ర పోలీసులు అప్పట్లో టీడీపీ నేతలను బలవంతంగా బస్సులో ఎక్కించారు. ధర్మాబాద్ నుంచి ఔరంగబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లారు. వారు అనుమతి లేకుండా ప్రాజెక్టు వద్దకు వచ్చారని తరలించారు. ఈ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించి ఈ అరెస్ట్ వారెంట్ వచ్చింది. నాడు చంద్రబాబు సహా పలువురిపై లాఠీచార్జ్ జరిగింది.

నాన్ బెయిలబుల్ వారెంట్
నాటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీశారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా చంద్రబాబు స్పందించకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications