పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కోలాహలం సాగుతున్న వేళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం నిన్న పిఠాపురంలో జరిగిన ఎన్నికల నామినేషన్ ర్యాలీలో జాతీయ జెండాను ఓ చేత్తో, కూటమి జెండాల్ని మరో చేత్తో పట్టుకుని ప్రదర్శిండమే. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ రాజకీయ పార్టీలేవీ ఈసీకి ఫిర్యాదు చేయలేదు.
నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన జన సందోహాన్ని చూసి పవన్ ఉత్సాహంగా ఓ చేత్తో జాతీయ జెండాతో పాటు మరో చేతిలో కూటమి జెండాల్ని పట్టుకుని ఊపారు. ఇలా ఓ చేత్తో జాతీయ జెండాను, మరో చేత్తో పార్టీల జెండాల్ని పట్టుకోవడం జాతీయ జెండా కోడ్ నిబంధనలకు విరుద్ధం. ఈ సందర్భంగా పవన్ జాతీయ జెండాను అగౌరవపరిచారన్న విమర్శలు వస్తున్నాయి.

జాతీయ జెండా కోడ్ ప్రకారం ఎవరైనా జాతీయ జెండాను ప్రదర్శించవచ్చు. అయితే దాన్ని అత్యున్నత స్ధానంలో లేదా ఎత్తులో ఉంచి ప్రదర్శించాలి. పార్టీల జెండాలు, ఇతర జెండాలతో కలిపి ప్రదర్శించరాదు. అలాగే ఎవరైనా చేత్తో జాతీయ జెండా పట్టుకుని ప్రదర్శిస్తున్నప్పుడు అది కుడిచేతిలోనే ఉండాలి. ఇక్కడ పవన్ ఎడమ చేతిలో జండా ఉంది. ఇలా చేస్తే కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో పవన్ జెండా కోడ్ ఉల్లంఘించినట్లయింది.












Click it and Unblock the Notifications