నారా లోకేష్ చెప్పింది తప్పు, అందుకే విబేధిస్తున్నా: కొడుకుకు సరదా షాకిచ్చిన బాబు!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలతో విబేధించారు! ఈ ఆసక్తికర సన్నివేశం ఏపీటా సదస్సులో చోటు చేసుకుంది. సదస్సులో తొలుత లోకేశ్‌ మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడిన బాబు సరదాగా మాట్లాడుతూ.. లోకేష్‌కు ఝలక్ ఇచ్చారు.

చదవండి: వారితో పాటు ఏపీ సీఎం చంద్రబాబునూ పిలుద్దాం: అధికారులతో కేసీఆర్

రాష్ట్రానికి చెందిన యువత ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చినప్పుడు, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో పనిచేసేందుకు సిద్ధపడుతున్నారని, విశాఖపట్నంలో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఇతర రాష్ట్రాలకు పోవడం కాకుండా, మన దగ్గరే పని చేసుకోవడానికి యువత ముందుకు రావాలని, ఇక్కడ ఉద్యోగాలు చేయాలని లోకేష్ అన్నారు.

చదవండి: టి-టిడిపికి కాపు సెగ!: రిజైన్ చేస్తా.. బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్, 'జగన్ దురదృష్టవంతుడు'

లోకేష్‌తో విబేధిస్తున్నా

లోకేష్‌తో విబేధిస్తున్నా

ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. సరదాగా మాట్లాడుతూ.. నారా లోకేష్ వ్యాఖ్యలతో విబేధించారు. తాను లోకేశ్‌ వ్యాఖ్యలతో విబేధిస్తున్నానని, తెలుగువారు చాలా తెలివైనవారని, తమ మేథో సంపత్తిని విస్తృత పరచడానికి వారు ప్రపంచదేశాలకు వెళ్లాలని, బాగా రాణించాలని వ్యాఖ్యానించారు.

ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు

ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు

ప్రపంచానికి సేవ చేయాలనే దృష్టితోనేగాని డబ్బుల కోసం చూసుకోరాదని చంద్రబాబు అన్నారు. తాను ఏ దేశానికి వెళ్లినా, అక్కడ మన తెలుగువారు ఎక్కువగా ఉంటున్నారని, వారితో అక్కడ మనం సభ పెట్టవచ్చునని ఆయన అన్నారు.

 లోకేష్ ఇలా అన్నాడు కానీ

లోకేష్ ఇలా అన్నాడు కానీ

ఒక అడుగు ముందుకేస్తే వంద అడుగులకు అదే నాంది అని చంద్రబాబు అన్నారు. అయితే, ఐటీ మినిస్టర్ ఓ మాట అన్నాడని చెబుతూ... 'ఆయనేమన్నాడంటే (లోకేష్) మీరంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, మీరంతా ఇక్కడికి రావాలన్నాడు. నా ఆలోచన ఏమిటంటే, మీరు ప్రపంచమంతా వెళ్లాలి. ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉండాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంద'ని చంద్రబాబు చెప్పారు.

పాలనలో పారదర్శకత పెరిగింది

పాలనలో పారదర్శకత పెరిగింది

తాను రియల్ టైమ్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన తర్వాత పాలనలో పారదర్శకత పెరిగిందని చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగా అభివృద్ధిని చేస్తామని వెల్లడించారు. 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని నిలుపుతామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Difference between ndhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and IT Minister Nara Lokesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి