కూటమిలో విభేదాలు..టీడీపీ ,జనసేనల మధ్య పదవుల చిచ్చు

టీడీపీ ,జనసేన పార్టీల మధ్య పదవుల చిచ్చు చేలరేగిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో జనసేన ,టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ముఖ్యంగా జనసేన, టీడీపీ కలవడం ద్వారానే కూటమి గెలుపు ఖాయమైంది. అందరూ భావించినట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవులను సైతం మూడు పార్టీలు పంచుకున్నాయి. అంతా బాగానే ఉందనుకునే సమయంలో జనసేన ,టీడీపీ పార్టీల మధ్య పదవుల చిచ్చు మొదలైంది.

ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు చోటుకున్నాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పదవులపై ముందుగానే కుదిరిన ఒప్పందం ప్రకారం కాకుండా వేరే అభ్యర్థి విజయం సాధించడంపై కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. దీంతో కూటమి పార్టీలు మాత్రమే నిలిచాయి. అయినప్పటికీ ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

Differences between TDP and Jana Sena parties

ఒప్పందం ప్రకారం పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు. టీడీపీ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జనసేన వెన్నుపోటు పోవడం వల్లే ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.జనసేన పొత్తు ధర్మం పాటించలేదని.. అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడని జనసేనకు టీడీపీ కౌంటరిస్తోంది. పోటీ చేసిన రెండో వార్డులో టీడీపీ రెబల్‌ను ఎందుకు ఎంకరేజ్ చేశారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.ఈ పరిణామాలు మరోసారి పిఠాపురంలో జనసేన వర్సెస్‌ టీడీపీగా మారాయి.కూటమిలోని టీడీపీ-జనసేన పార్టీలే పోటాపోటీగా బరిలోకి దిగి ఇలా విమర్శలు గుప్పించుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పదవుల విషయంలో మరింత ఘర్షణ చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+