వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, బాబులపై ట్విట్టర్‌లో డిగ్గీ: ప్రధానికి లగడపాటి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Diggy responds on Twitter
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల వైఖరి పైన సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్‌లో స్పందించారు.

రాజకీయ లబ్ధి కోసమే జగన్, చంద్రబాబులు విభజన విషయంలో మాట మార్చారని మండిపడ్డారు. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు హైదరాబాదులో విద్య, వైద్య అవకాశాలు కల్పిస్తామని, సీమాంధ్రకు అభివృద్ధి ప్యాకేజీని ప్రకటిస్తామని చెప్పారు.

కాగా, రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఈ పదేళ్లలో హైదరాబాదు పైన అధికారం గవర్నర్‌కు లేదంటే కేంద్రం చేతిలో ఉంటుందని దిగ్విజయ్ సింగ్ ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. విభజన అంశం రెండుసార్లు శాసన సభకు వెళ్తుందని చెప్పారు. తొలుత ముసాయిదా తీర్మానం, ఆ తర్వాత బిల్లు ముసాయిదా సభకు వెళ్తాయన్నారు. రాబోయే పదేళ్ల పాటు హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుందని, ఈ పదేళ్లలో హైదరాబాద్ పాలన గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం మాత్రం కాబోదని స్పష్టం చేశారు.

ప్రధానికి లగడపాటి లేఖ

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సోమవారం లేఖ రాశారు. విభజనపై కేబినెట్ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. 33 మంది ఎంపీలను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దన్నారు. విభజనపై ఏకాభిప్రాయం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

English summary
AP State Incharge Digvijay Singh responded on Twitter over AP division issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X