Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ మూడో భార్యకు విడాకులు.. ఈ వార్తల వెనుక బిగ్ రీజన్స్!!

సినిమాలో పనిచేసే స్టార్ సెలబ్రిటీలకు ప్రేమించుకోవడం బ్రేకప్ చెప్పడం, పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం చాలా సహజంగా జరిగేవి. అయితే ఈ కోవలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జరిగిన చర్చ మరే ఇతర వ్యక్తుల గురించి జరగ లేదు అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన మూడో భార్య అన్నా లెజ్నెవా తో కూడా విడాకులు తీసుకుంటున్నట్టు వీరి పెళ్లి కూడా పెటాకులు అవుతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇదంతా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అని అభిమానులు చెబుతున్నప్పటికీ ఈ ప్రచారంలో కొంత వాస్తవం ఉంది అన్న చర్చ కూడా జరుగుతుంది.

pawankalyanandannalezhneva

పవన్ కళ్యాణ్ తన మూడవ భార్యతో విడాకులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇటు మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఇటీవల పరిణామాలు కొన్ని పవన్ కళ్యాణ్ మూడో భార్య అయిన అన్నా లెజ్నెవాకు మధ్య సంబంధం సరిగాలేదని తెలుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పిల్లలతో కలిసి రష్యా వెళ్లినట్టు సమాచారం.

అయితే ఇప్పటి వరకు ఆమె తిరిగి ఎందుకు రాలేదు? ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఉంటుంది అని పలువురు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో జరిగే అన్ని కార్యక్రమాలకు గతంలో హాజరయ్యేవారు. అన్ని వేడుకలలోనూ వాళ్ళు పాల్గొనేవారు. కానీ ఇటీవల కాలంలో జరిగిన అనేక వేడుకలలో వారిరువురూ కలిసి పాల్గొనలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే పాల్గొన్నారు.

pawankalyanandannalezhneva

ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధ వేడుకలో పవన్ కళ్యాణ్ ఒక్కరే పాల్గొన్నారు. అక్కడ కూడా అన్నా లెజ్నెవా కనిపించలేదు. తర్వాత వారాహీ విజయయాత్రకు ముందు పవన్ కళ్యాణ్ నిర్వహించిన యాగంలో కూడా అన్నా లెజ్నెవా కనిపించలేదు. ఇక రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లింకార నామకరణ వేడుకలోనూ అదే పరిస్థితి. ఇక ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాలేదు.

ఇక ఈ పరిణామాలే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలకు కారణంగా మారాయి. ఇక దీని పైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది పవన్ ని ఇబ్బంది పెట్టడం కోసం కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా చెబుతున్నారు. దీని వెనుక ఎవరున్నారు అన్నది ఏపీ ప్రజలకు తెలుసని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ విడాకులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+