ప్రజలకు టోకరా వేస్తున్న తాడేపల్లి నియంత జగన్ రెడ్డీ .. మహిళల ఉసురు పోసుకోకు: దివ్యవాణి సంచలనం
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టిస్తున్న తాడేపల్లి నియంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ మండిపడ్డారు దివ్యవాణి. ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన దసరా పండుగ సమయంలో మహిళలు మాంగల్యాలను తాకట్టు పెట్టి మరి జీవనాన్ని వెళ్ళదీసుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని దివ్యవాణి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవన స్థితిగతులను తెలియజేశారు. మహిళల కోసం వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.

ఆసరా పేరుతో మహిళలకు టోకరా వేస్తున్న జగన్
జగన్మోహన్ రెడ్డికి ఆసరా అనే పదానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు టీడీపీ మహిళా నాయకురాలు దివ్య వాణి. రాష్ట్రానికి ఆసరాగా ఉండాల్సిన సీఎం జగన్ మహిళలకు టోకరా వేస్తున్నారని దివ్యవాణి అసహనం వ్యక్తం చేశారు. ఆసరా పేరుతో మీరు టోకరా వేయడమే కాకుండా మహిళలకు లబ్ధి చేకూర్చిన చంద్రబాబుపై వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. మహిళలకు డ్వాక్రా రుణమాఫీల ద్వారా, పసుపు కుంకుమ దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిన చంద్రబాబు మీద నిందలు వేయడం పులివెందుల న్యాయమా అంటూ ప్రశ్నించారు.

మహిళలకు ఆసరా ఇవ్వకుండా మోసం చేస్తున్న జగన్
చంద్రబాబు హయాంలో 90 లక్షల మంది మహిళలకు ప్రభుత్వం అందించే పెన్షన్ ల ద్వారా లబ్ధి చేకూరగా, జగన్ హయాంలో దానిని 78 లక్షలకు కుదించారని, లక్షలాది మంది మహిళలకు జగన్ పెద్ద పంగనామం పెట్టారని దివ్యవాణి విమర్శించారు. 78 లక్షల మందిలోనూ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చాలామందికి పథకాన్ని వర్తింపజేయకుండా ఇబ్బంది పెడుతున్నారని దివ్యవాణి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ రుణాలను దాదాపు అన్ని పొదుపు సంఘాల మహిళలకు వర్తింపజేస్తే, జగన్ హయాంలో ఎంతమందికి సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.

మహిళల పొదుపు సొమ్ము సహకార బ్యాంకులకు మళ్లించిన జగన్
మహిళలు చేసుకున్న పొదుపు డబ్బులు జాతీయ బ్యాంకులలో ఉంటే, దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును సహకార బ్యాంకులకు మార్చి జగన్ మహిళలను మోసం చేస్తుంది నిజం కాదా అంటూ దివ్యవాణి ప్రశ్నించారు. జాతీయ బ్యాంకులలో ఉన్న డబ్బులు సహకార బ్యాంకులకు మార్చాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. చంద్రన్న పెళ్లి కానుకలను రద్దుచేసి, పెళ్లీడుకొచ్చిన మహిళల కోసం ఏ విధంగానూ ఆసరాగా జగన్ నిలబడడం లేదన్నది నిజం కాదా అంటూ మండిపడ్డారు.

లిక్కర్ పేరుతో రాష్ట్ర ప్రజలపై వైసీపీ దోపిడీ
రెండున్నర ఏళ్ల పాలనలో 600 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, రౌడీషీటర్లకు డైరెక్టుగా లైసెన్సులు ఇచ్చేస్తూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు అనేది వాస్తవం కాదా అని దివ్యవాణి ప్రశ్నించారు. మహిళలపై నిత్యం ఒక చోట దారుణాలు జరుగుతున్నా జగన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ధ్వజమెత్తారు. కొంతమంది గబ్బు నోళ్లు చంద్రబాబు పాలన సమయంలో మద్యపాన నిషేధం అంటూ, మద్యం బాటిళ్లు పగలగొట్టి ఒక సినిమా చూపించి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ప్రస్తుతం మద్యపానం విక్రయాల పేరుతో సామాన్యుల నుండి మిడిల్ క్లాస్ వరకు దాదాపు 25 వేల కోట్ల రూపాయల పేద ప్రజల సొమ్మును దోచుకున్నది నిజం కాదా అని దివ్యవాణి నిలదీశారు. జగన్ అసమర్థ పాలనను ప్రశ్నించే టీడీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు దిగటం నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెడుతూ నిరంకుశంగా వ్యవహరిస్తుంది మీరు కాదా అంటూ దివ్య వాణి భగ్గుమన్నారు.

రాష్ట్రంలో మహిళల దుర్భర స్థితి
మహిళలు మాంగల్యాన్ని తాకట్టు పెట్టుకునే దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందని, ఇలాంటి పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో లేదని దివ్యవాణి మండిపడ్డారు. కల్లబొల్లి మాటలతో, దౌర్జన్యాలతో, అరాచక పాలనతో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్ళింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో ప్రతి విషయంలో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు అని, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడితే అది చంద్రబాబు వల్లనే అంటూ చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మీరు తప్పులు చేసి ప్రశ్నిస్తే ఆ తప్పులను చంద్రబాబుకు రుద్దుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో చెయ్యని దారుణాలు లేవని దివ్య వాణి అభిప్రాయం వ్యక్తం చేశారు.
దసరా సమయంలో మహిళల ఉసురు పోసుకోకన్న దివ్యవాణి
జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తని, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్ తీరు దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు అని దివ్యవాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దిశా చట్టం ఇంకా అమలులో లేదని, జగన్ పాలన ఎలా ఉందో అందరూ చూస్తున్నారని అన్నారు దివ్యవాణి. దసరా పండుగ సమయంలో మహిళల ఉసురు పోకుండా వారి జీవితాలకు భరోసా ఇచ్చే విధంగా, ఆసరా ఇచ్చే విధంగా పరిపాలన సాగించాలని డిమాండ్ చేశారు. కల్లబొల్లి మాటలతో మాయ పరిపాలన కట్టిపెట్టి మహిళల కన్నీళ్లు తుడిచి మంచి పరిపాలన సాగించాలని ఆశిస్తున్నామంటూ దివ్యవాణి పేర్కొన్నారు. చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications