వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఎన్ఏ అంటే తెలుసా.. పెద్దిరెడ్డి, బొత్సపై టీడీపీ నేతల ఫైర్, గవర్నర్‌కు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పీక్‌కి చేరింది. అధికార- విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్- చంద్రబాబు నాయుడు ఒక్కటేనని మంత్రులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎస్ఈసీపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. చంద్రబాబుతో లింక్ కలిపి నోరు పారేసుకోవడం సరికాదని చెప్పారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

మంత్రులు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. వారిని పిలిచి మందలించాలని.. బాద్యతాయుతమైన పదవీలో ఉండి ఇలా కామెంట్ చేయడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డీఎన్ఏ గురించి కామెంట్ చేస్తున్నారు.. వారికి డీఎన్ఏ అంటే అర్థం తెలుసా అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

 దేశం ఆశ్చర్యపోతోంది..

దేశం ఆశ్చర్యపోతోంది..

కావాలనే నోరు పారేసుకోవడం తగదని సూచించారు. ఏపీ పంచాయతీ ఎన్నికలు నేషనల్ వైడ్‌గా ఫోకస్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను చూసి దేశం ఆశ్చర్యపోతుందని వివరించారు. కేబినెట్ నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వారి వల్లే పంచాయతీ ఎన్నికలు దేశం దృష్టి సారించాయని.. మంచి అయితే ఫరవాలేదు.. కానీ చెడుగా చెప్పడం సరికాదనన్నారు.

నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..

నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..

మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు అని మరో నేత ఆలపాటి రాజా అన్నారు. వారి తీరుతో ఏపీ పరువుపోయేలా ఉందన్నారు. నరం లేని నాలుక నోటికొచ్చినట్టు మాట్లాడుతోందని.. కానీ జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యత వహిస్తారని అడిగారు.

మాటల యుద్ధం..

మాటల యుద్ధం..

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. అప్పటినుంచి వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమయ్యారు. కానీ నేతల మధ్య మాటలయుద్ధం మాత్రం జరుగుతోంది.

English summary
tdp leaders varla ramaiah, venkanna angry on andhra pradesh ministers botsa satyanarayana, peddireddy ramachandra reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X