నాడు టీఆర్ఎస్ - నేడు బీఆర్ఎస్ : చిరు- పవన్ కు ఈ రెండు పార్టీలతో అక్కడే లింకు..!!
తెలుగు గడ్డ పైన జాతీయ పార్టీ ఏర్పాటైంది. కేసీఆర్ అధ్యక్షతన ఇప్పటి వరకు కొనసాగుతన్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిపోయింది. నేడు విజయదశమి పర్వదినం నాడు టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇతర పార్టీ నేతల సమక్షంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. సరిగ్గా 1.19 గంటలకు ముందుగానే నిర్ణయించిన ముహూర్తానికి తీర్మానం ఆమోదించిన విషయాన్ని వెల్లడిస్తూ..కేసీఆర్ ఇప్పటి వరకు టీఆర్ఎస్ గా కొనసాగిన పార్టీ ఇక బీఆర్ఎస్ గా మారబోతోందంటూ ప్రకటించారు.

కేసీఆర్ రెండు పార్టీలు - మెగా బ్రదర్స్
దీని పైన రాజకీయంగా చర్చ అనేక రకాలుగా కొనసాగుతోంది. ఇదే సమయంలో దసరా నాడు టీఆర్ఎస్ కొత్త పార్టీ బీఆర్ఎస్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ అయింది. ఈ మూవీ పైన మెగా ఫ్యాన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీనికి ఒక్క రోజు ముందే చిరంజీవి తన సోదరుడు పవన్ నిర్వహిస్తున్న జనసేనకు అవసరమైతే తన మద్దతు ఉంటుందంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర లేపారు. దీని పైన అనేక రకాలుగా స్పందన వస్తోంది. ఇక, కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన సమయంలోనే మరో ఇంట్రస్టింగ్ చర్చ తెర మీదకు వచ్చింది.

టీఆర్ఎస్ ఏర్పాటు - ఖుషీ విడుదల
2021 లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. నేడు జాతీయ రాజకీయాల్లో మార్పు లక్ష్యంగా ప్రకటించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీలకు - మెగా బ్రదర్స్ కు లింకు ఉంది. అయితే, అది రాజకీయంగా కాదు. 2021లో కేసీఆర్ నాడు టీఆర్ఎస్ ప్రకటించిన నాడు.. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా విడుదల అయింది. టీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా...తెలంగాణ సాధించటంతో పాటుగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడో సారి అధికారం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

బీఆర్ఎస్ ప్రకటన - గాడ్ ఫాదర్ రిలీజ్
ఇక, అదే రోజు విడుదలైన ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కేసీఆర్ తెలంగాణ సాధన పూర్తి కావటంతో, జాతీయంగా అనేక లక్ష్యాలతో భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసారు. ఈ రోజు దసరా కావటంతో ఈ రోజున పార్టీ ప్రకటనకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ రోజున కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ సమయంలోనే..అటు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ విడుదల అయింది. ఈ రెండు సందర్భాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. హిస్టరీ రిపీట్స్ అంటూ పోస్టింగ్ లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications