ఏసీలు వాడుతున్నారా? కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఇలా చెయ్యండి!

ఈసారి ఎండలు మండుతాయని వాతావరణ శాఖాదికారులు చెప్పారు. ఇప్పటికే విపరీతమైన ఎండలు రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయటికి వెళితే చెమటతో, ఉక్కపోతతో భరించలేని పరిస్థితి ఉంటుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేని వారందరూ ఇంట్లో ఏసీల ముందు, కూలర్ల ముందు కూర్చుని సేద తీరుతున్నారు.

ఏసీలు వాడుతున్నారా? కరెంట్ బిల్ తక్కువ రావాలంటే చిట్కాలు
అయితే అస్తమానం ఏసీలు, కూలర్లు వాడడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే ఇబ్బంది కూడా ఉంటుంది. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఏసీల వాడకం కొనసాగుతుంది. అయితే ఎండల దెబ్బకు ఏసీ ఉపయోగించినప్పటికీ, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఏసీలు వాడుతున్నా తక్కువ కరెంట్ బిల్ రావాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

Do you use Air Conditioners Do this to reduce your electricity bill

ఏసీలకు కరెంట్ బిల్ తక్కువ రావాలంటే
చలికాలం ఏసీని ఉపయోగించనివారు, చాలాకాలం తర్వాత ఎండాకాలం రాగానే ఏసీలను వినియోగంలోకి తెస్తున్నారు. అయితే ఏసీలను ఉపయోగించే ముందు ఒకసారి కచ్చితంగా వాటిని సర్వీసింగ్ చేయించాలి. మరీ 10 సంవత్సరాలు దాటిన పాత ఏసీలు వినియోగిస్తే కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏసీ మెకానిక్ ల తో ఒకసారి ఏసీలను చెక్ చేయించి వారి సలహా మేరకు ఉపయోగించుకోవడం మంచిది.

రూమ్ టెంపరేచర్ విషయంలో జాగ్రత్త
పాత ఏసీలు బాగా కరెంట్ బిల్ వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో కరెంట్ వినియోగం తక్కువ ఉండే ఏసీలను కొనుగోలు చేసుకుంటే మంచిది. ఇక ఎండలో చల్లదనం కోసం చాలామంది రూమ్ టెంపరేచర్ 16 డిగ్రీల సెల్సియస్ వద్ద పెట్టుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల ఏసీ కంప్రెషర్ పనిచేయడానికి అదనంగా కరెంటు తీసుకుంటుంది. దీనివల్ల కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

గది విషయంలో ఇలా చెయ్యండి
ఏసీ వినియోగించేవారు ఎప్పుడూ 24 డిగ్రీలు, 25 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఆటో మోడ్ ఉపయోగించినప్పుడు, గది చల్లబడగానే కంప్రెషర్ దానికదే ఆఫ్ అవుతుంది. అప్పుడే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఏసీ ఉన్న గది విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అది సూర్యకాంతికి డైరెక్ట్ గా లేకుండా చూసుకోవాలి.

గదిలో ఏసీ విషయంలో జాగ్రత్తలు
ఏసీ ఉన్న గదిలో షెల్ఫ్ లు ఓపెన్ గా లేకుండా, ఎక్కువ ఇనుప వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఇక ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఏసీ ఉపయోగించినా పవర్ తక్కువగా తీసుకుంటుంది. గది త్వరగా చల్లబడుతుంది. దీంతో కరెంట్ బిల్లుల బాదుడు నుండి ఉపశమనం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+