షాక్: చికిత్స కోసమంటూ మరుగుదొడ్లోకి తీసుకెళ్ళి ఇలా...వైద్యుడిని చితకబాదారిలా...
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలికపై విధినిర్వహణలో ఉన్న డాక్టర్ అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన రాజమండ్రిలో చోటుచేసుకొంది. నిందితుడిని బాదితురాలి కుటుంబ సభ్యులు చితకబాది పోలీసులకు అప్పగించారు.
రాజమండ్రి: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలికపై విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నాడు రాజమండ్రిలో చోటుచేసుకొంది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీరామనగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక నాన్నమ్మ ఇటీవలే మరణించింది. దీంతో ఆ బాలిక మానసికంగా కృంగిపోయింది. దీంతో ఆబాలికను తొలుత ప్రభుత్వ ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించారు.

ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యుల సూచనల మేరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతోంది.ప్రైవేట్ ఆసుపత్రిలో బాలికను ఈ నెల 7వ, తేదిన చేర్పారు.
అయితే ఆదివారం నాడు ఐసియూ లో చికిత్స పొందుతున్న బాలిక వద్దకు విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ రాంగోపాల్ రెడ్డి వచ్చారు. బాలిక వద్దే ఉన్న ఆమె బంధువును బయటకు పంపాడు.
బాలికను ఐసియూకు అనుబంధంగా ఉన్న మరుగుడొడ్డిలోకి తీసుకెళ్ళి అత్యాచారాయత్నానికి ప్రయత్నించాడు.అయితే బాలిక ప్రతిఘటించింది. దీంతో బాలికపై నిందితుడు దాడి చేశాడు.
అయితే బాలిక గట్టిగా అరిచింది.దీంతో నిందితుడు ఆమెను వదిలేశాడు. బాలిక కేకలు విన్న ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు.అయితే బాలిక అసలు విషయం చెప్పింది.దీంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని నిందితుడిని చితకబాదారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications