వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా సాధించి నోరు మూయిస్తాం: డోక్కా, ప్రత్యేక సీమ భేటీకి శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు/ హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలో మిత్రపక్షంగా ఉంటునే రాష్ట్రానికి నిధులను సాధిస్తామన్నారు. హోదా తీసుకువచ్చి ప్రతిపక్షాల నోరుమూయిస్తామని డొక్కా అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగే టీడిపీ విసృతస్దాయి సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని మాణిక్యవరప్రసాద్ తెలిపారు.

Dokka Manikya Varaprasad

ఇదిలావుంటే, సొంత ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీరాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో కోట్లు కొల్లగొట్టాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు.

21న ప్రత్యేక రాయలసీమ భేటీకి హాజరవుతా అని ఆయన అన్నారు. సీమ వాసుల సమస్యలకు పరిష్కారం ప్రత్యేక రాయలసీమతోనే సాద్యమవుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేయాలని శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రాయలసీమ ఎడారిగా మారడానికి చంద్రబాబు కారణమని ఆయన విమర్శించారు. తన ఊరిని అభివృద్ధిని చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారని ఆయన అడిగారు. చంద్రబాబు తన భాషను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

English summary
Andhra Pradesh Telugu Desam party (TDP) leader Dokka Manikay Varaprasad said that they will achive specila category status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X