డాలర్ శేషాద్రి భౌతికకాయానికి అంత్యక్రియలు: పాడె మోసిన వైసీపీ ఎమ్మెల్యేలు
తిరుపతి: గుండెపోటుతో కన్నుమూసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి భౌతిక కాయానికి అంత్యక్రియలు ముగిశాయి. కార్తీక చివరి సోమవారం నాడు విశాఖపట్నంలో ఆయన కన్నుమూశారు. అనంతరం భౌతికకాయాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎంబాల్మ్ నిర్వహించారు. రోడ్డు మార్గంలో తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతిలోని సరోజిని దేవి లేఅవుట్‌లో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
జిల్లా అధికారులు, పలువురు స్థానికులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు భౌతిక కాయాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. ఈ మధ్యాహ్నం అంతిమయాత్రను చేపట్టారు. వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో అంతిమయాత్ర సాగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి, చంద్రగిరి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. పాడె మోశారు.

గోవింద నామస్మరణతో సరోజిని దేవి లేఅవుట్ నుంచి హరిశ్చంద్ర శ్మశాన వాటిక వరక అంతిమయాత్ర సాగింది. అక్కడ అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ అంతిమయాత్రలో పలువురు స్థానికులు పాల్గొన్నారు. శ్రీనివాసుడి సేవలో ఉంటూ తుదిశ్వాస విడించిన డాలర్ శేషాద్రి సేవలను స్మరించుకున్నారు. వందలాదిమంది తిరుపతివాసులు, టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.
డాలర్ శేషాద్రి భౌతికకాయానికి అంత్యక్రియలు: పాడె మోసిన వైసీపీ ఎమ్మెల్యేలు#DollarSeshadri pic.twitter.com/DueNIpPgDp
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2021
డాలర్ శేషాద్రి మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కడ వరకూ శ్రీవారి సేవలో కొనసాగిన ధన్యజీవిగా నివాళి అర్పించారు. డాలర్ శేషాద్రి మరణం టీటీటీకి తీరని లోటుగా ఎస్వీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు, దేవాలయ ఆచార వ్యవహారాలపై మంచి పట్టు, అపార అనుభవం ఉన్న డాలర్ శేషాద్రి మరణం వల్ల ఏర్పడిన ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications