బిల్లు వ్యతిరేకించొద్దు: పితాని, చర్చ జరగాలన్న పనబాక

హైదరాబాద్/గుంటూరు: తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకించవద్దని, అందులోని అంశాలను మాత్రమే వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శాసనసభ సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో సమైక్య తీర్మానం సాధ్యం కాదని అన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లను పితాని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సభలో బిల్లుపై చర్చ జరిగేందుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.

Pitani Satyanarayana

బిల్లును అడ్డుకోవడం సరికాదు: పనబాక

శాసనసభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవడం సరికాదని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆమె సోమవారం మాట్లాడుతూ.. బిల్లుపై చర్చలో పాల్గొని సభ్యులు తమ అభిప్రాయం తెలపాలని ఆమె సభ్యులను కోరారు.

నమ్మకాన్ని వమ్ము చేయం: అశోక్ బాబు

సీమాంధ్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని ఏపిఎన్జివో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలే కీలకం కానున్నాయని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం శాయశక్తులా కృషి చేస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు. సంక్రాంతి పండగలోపు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

సమైక్య ఉద్యమంలో సీమాంధ్ర నేతలందర్నీ, ఉద్యోగులను ఎలా భాగస్వాములను చేయాలని చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర నేతలందరూ చెప్పాలని అశోక్ బాబు కోరారు. సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు తెలంగాణ బిల్లుపై చర్చించి తమ అభిప్రాయాలను చెప్పాలని కోరుతున్నట్లు అశోక్ బాబు తెలిపారు. కాగా కడపలో ఏపిఎన్జివోల మధ్య చోటు చేసుకున్న సంక్షోభాన్ని తొలగించేందుకు ఓ కమిటీ వేయనున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+