టీడీపీ నమ్ముతున్న ఆ సర్వే సంస్థ ఎన్నిసార్లు ఫెయిల్ అయిందో తెలుసా..?

దేశ వ్యాప్తంగా శనివారంతో తుది దశ పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. ఈలోపే ఎగ్జిట్ పోల్స్ సందడి చేశాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. జాతీయ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించాయి. అయితే స్థానికంగా చేసిన ఆరా సర్వేనే మెజార్టీ ప్రజలు నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఆయన గతంలో చేసిన సర్వేలన్నీ కూడా విజయవంతం అయ్యాయి.

ఆరా మస్తాన్ మరోసారి ఏపీలో జగన్ పార్టీదే విజయం అని తేల్చి చెప్పారు. దీంతో ఆయనపై టీడీపీ కూటమి శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఆరా మస్తాన్‌కు వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. ఆయనిచ్చిన సర్వేలకు అధికంగా స్థానాలు వస్తాయే తప్పిస్తే తక్కువ ఎప్పుడు రాలేదని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కూటమి నేతలు .ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వేను బలంగా నమ్ముతున్నారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఏపీలో వైసీపీ 2 నుంచి 4 పార్లమెంట్ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చి చెప్పింది.

Doubts on credibility of India Today Axis My India organization survey

అయితే ఈ సంస్థ గతంలో ఇచ్చిన సర్వేలకు వచ్చిన ఫలితాలకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 2023 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల్లో ఈ సంస్థ కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని తెలిపింది..అయితే అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది.2023 సంవత్సరంలో రాజస్థాన్‌లో ఎలక్షన్స్ జరగ్గా అక్కడ కూడా ఈ సంస్థ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పగా బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది.2021 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఈ సంస్థ చెప్పగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

దీంతో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ క్రెడిబిలిటీపై అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి.వాస్తవానికి రాయలసీమలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైసీపీవ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇచ్చిన సర్వే లెక్కలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. దాదాపుగా 75 శాతం సర్వే సంస్థలు వైసీపీదే ఏపీలో అధికారమని చెబుతున్నా కొన్ని సంస్థలు మాత్రం కూటమికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా తప్పుడు సర్వేలు ప్రకటించాయని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+