అందుకే రాహుల్ సభలో నిద్ర: డీఎస్, సోనియాకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల లోకసభలో కునుకు తీయడం పతాక శీర్షికలకు ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డీ శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అంతకుముందు రోజు రాత్రి వేళ ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచులు చూడటం వల్లనో లోక మరే కారణంగానే రాహుల్ గాంధీకి సభళో కొద్దిగా నిద్ర ఆవహించి ఉంటుందన్నారు.

గతంలో ఇతర పార్టీలకు చెందిన ప్రధానమంత్రులే సభలో నిద్రపోయారని డీ శ్రీనివాస్ ఆరోపించారు. చాలాంది ఎంపీలు కడా నిద్రపోయారని, దీనిని ఇష్యూ చేయడం సరికాదన్నారు. ఆయన శనివారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు.

DS meets Sonia, asks her to instruct party MPs to oppose Polavaram Bill in RS

పోలవరం ఆర్డినెన్స్ విషయంలో నాలుగు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తెచ్చేలా ఎన్డీయే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని సోనియాను కోరినట్లు తెలిపారు. కేంద్రం తీరును వ్యతిరేకించాలని కోరామన్నారు. అలాగే తెలంగాణకు రావాలని కోరామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణి పైన సోనియాకు వివరించామన్నారు.

గిరిజనుల మనోభావాలు తెలుకోకుండా, గిరిజన చట్టాలను వ్యతిరేకించి పునర్విభజన చట్టం 2014 సవరణ బిల్లుని కేంద్రం తీసుకు వచ్చిన తీరు సరికాదన్నారు. అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించానన్నారు. ఏయే కార్యక్రమాలతో ప్రజలకు చేరవ కావాలనే అంశంపై దృష్టి సారిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+