డ్యాన్స్‌తో దుమ్మురేపిన దువ్వాడ శ్రీనివాస్ , మాధురి.. పిచ్చెక్కించారుగా!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తెలుగు రాష్ట్రాలలో ఈ పేర్లు తెలియని వారు ఎవరు ఉండరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉండి, ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో పెట్టుకున్న ఎఫైర్, ఆపైన దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ భార్య ల మధ్య జరిగిన రచ్చ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఫంక్షన్లో సందడి చేసిన దువ్వాడ, మాధురి జంట
ఇక ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల, మాధురి జంట సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ జంట హైదరాబాద్లో జరిగిన తమ ఫ్యామిలీ ఫంక్షన్లో అదిరిపోయే స్టెప్పులతో రచ్చ లేపారు. ఇటీవల దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట తెగ సందడి చేశారు.

భారీ స్టేజ్ మీద అదిరిపోయే పర్ఫామెన్స్
హైదరాబాద్లోని ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన హాఫ్ సారీ ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఒక భారీ స్టేజ్ మీద పర్ఫామెన్స్ చేశారు. కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ లో, భారీ డెకరేషన్ తో ఏర్పాటు చేసిన పెద్ద స్టేజి మీద, కాస్ట్లీ కాస్ట్యూమ్ తో అదరగొట్టారు.
వారి ప్రేమకథకు తగ్గట్టే సాంగ్
తమకు సూట్ అయ్యే ఒక సాంగ్ ని సెలెక్ట్ చేసుకొని, దానికి తగినట్టు స్టెప్పులు వేసి దివ్వెల మాధురి youtube ఛానల్ లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఆ సాంగ్ కూడా వారిద్దరి ప్రేమ కథకు తగ్గట్టుగానే ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అందరూ వాళ్ళ ప్రేమకథనే చర్చించుకుంటున్నారు అంట.. సాంగ్ లో కూడా తగ్గట్లేదుగా
ప్రస్తుతం సమాజంలో వాళ్ళిద్దరి ప్రేమ కథని చర్చించుకుంటున్నారు అని, హిందీలో ఉన్న ఆ పాట ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే హై హర్ జబాన్ పర్ అంటూ ఓల్డ్ రెట్రో సాంగ్ కు ఇద్దరు క్లాసీ డాన్స్ తో అదరగొట్టారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాదిరి ఎఫైర్ కి సంబంధించిన వివాదం తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో దివ్వెల మాధురి సెలబ్రిటీగా మారిపోయారు.
హైదరాబాద్లో దువ్వాడ జంట హంగామా
దువ్వాడ, దివ్వెల జంట స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ వకుళ సిల్క్స్ పేరుతో ఈ జంట హైదరాబాద్లో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.దీంతో ఇటీవల ఈ జంట ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండడం హైదరాబాద్లో హంగామా చేయడం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దివ్వెల మాధురి హాఫ్ సారీ ఫంక్షన్ హైదరాబాద్లో నిర్వహించారు.
ఓ రిసార్ట్ లో ఫంక్షన్ లో హంగామా చేసిన దువ్వాడ
హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో నిర్వహించిన ఈ వేడుకకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొద్దిమంది సెలెక్టెడ్ వ్యక్తులను మాత్రమే ఆహ్వానించారు. హైదరాబాద్ కు చెందిన పలువురు సినీ తారలు, రియల్టర్ లను ఆహ్వానించారు. ఇక ఈ ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరించి ఫంక్షన్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications