ఏపి ఎన్నికల ప్రధానాధికారి ఆకస్మిక బదిలీ: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..!
ఏపి లో ఎన్నికల వేడి రగులుతున్న వేళ..ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపి ఎన్నికల ప్రధానాధి కారిగా ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధి కారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించ రాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
సిసోడియా బదిలీ..
రాష్ట్ర విభజన తరువాత ఏపికి తొలి ఎన్నికల ప్రధానాధికారిగా సిసోడియా నియమితులయ్యారు. ఎన్నిక ప్రధనాధికారి గా రాష్ట్రంలో ఓట్ల చేరికలు..కొత్త వారికి అవకాశాలు వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, భారీగా ఓట్లను తొలి గించారని ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. వైసిపి దీని పై న్యాయ పోరాటంతో పాటుగా కేంద్ర ఎన్నికల కమి షన్ కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత డూప్లికేట్ ఓట్ల పై సిసోడియా దృష్టి సారించారు. ఆ లెక్కలను బయట పెట్టారు. ఇదే సమయంలో..హైకోర్టులో వైసిపి కేసు దాఖలు చేసింది. ఇవన్నీ జరుగుతుండగానే...కేంద్ర ఎన్నికల సంఘం సిసోడియా స్థానంలో మరొకరిని నియమించాలని నిర్ణయించింది. దీంతో గోపాలకృష్ణ ద్వివేదీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

కఠినంగా వ్యవహరిస్తాం..
అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని కొత్త ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివే ది పేర్కొన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు ద్వివేది. ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేదిని సీఈసీగా నియమించడంపై ఆసక్తి నెలకొంది. గోపాల కృష్ణ ద్వివేదీ గతంలో తూర్పు గోదావరి కలెక్టర్ గా.. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి పిఎస్ గా పని చేసారు.












Click it and Unblock the Notifications