ఆ ముగ్గురు నాతో ఉండటంతోనే ఇది సాధ్యమైంది - పవన్ కీలక వ్యాఖ్యలు..!!

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు.. తీసుకోకుంటే ఒప్పు అయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా తన పని తాను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివి తేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. బలమైన అధికారులు తనతో ఉన్నారని.. రిఫామ్స్ తీసుకువచ్చి పనిచేశారని చెప్పారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సిబ్బందితో డిప్యూటీ సీఎం పవన్ మాటా మాంతీ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులతో పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తన శాఖల ఉద్యోగులకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంకటకృష్ణ, శశిభూషణ్, కృష్ణతేజ వంటి వారు తనతో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. గతంలో చాలా అంశాల్లో పారదర్శకత లేదని తన దృష్టికి తీసుకు వచ్చారని.. సమీక్షల సమయా ల్లో చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చి పని చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించామని తెలిపారు.

Dy CM Pawan kalyan made interesting comments with employees over Govt success

తన తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని.. తనకు ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని పవన్ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఉద్యోగులకు ఏమి చేయాలని ఆలోచన చేస్తే.. సంస్కరణలు తేవాలని అధికారులు చెప్పారని అన్నారు.

ఇక, కష్టపడి పని చేసే వారికి ఎదుగుదల ఎంతో ముఖ్యమని భావించి అమలు చేశామని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ఉద్యోగుల ఇబ్బందులు, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికలు అమలు చేశామని తెలిపారు. నేటికీ మన దగ్గర వ్యవస్థలు బలంగా ఉన్ నాయంటే వెంకట కృష్ణ, శశిభూషణ్ లాంటి అధికారులు ఉండటమే కారణమని చెప్పారు. ఇది మొత్తం ఒక్కరు చేసింది కాదని.. అందరూ సమిష్టిగా అధికారుల సమూహం పని చేయడం ద్వారా నే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. తాను ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. క్లీన్ గవర్నెన్స్ కావాలని మాత్రమే అధికారులకు చెప్పానని తెలిపారు.

తన తండ్రి తాలూకా అనుభవం తనకు పని చేసింది కాబట్టే.. సీనియారిటీ, క్యాపబులిటీ చూడాలని మాత్రమే చెప్పానన్నారు. బదిలీలు, పదోన్నతుల పై అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు లెటర్లు ఇచ్చారని.. అయితే వారు సిఫార్సు చేసిన అధికారికి అర్హత ఉంటేనే చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంపదను పెంచిన తర్వాత హక్కుల గురించి, జీతాల పెంపు గురించి మాట్లాడాలని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులపై దాడి జరిగితే మాత్రం క్షమించేది లేదని.. వారి రక్షణ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+