టీటీడీ నిర్వహణలో డొల్లతనం బయట పెట్టిన పవన్..!!

డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి తొక్కిసలాట పైన స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. తప్పు జరిగిందని.. క్షమించమని భక్తులను కోరారు. టీటీడీ లో లోపాల గురించి పవన్ ప్రస్తావించారు. ఈవో, ఏఈవో మధ్య గ్యాప్ ఉందని వ్యాఖ్యానించారు. ఘటనకు పోలీసులు కూడా బాధ్యత వహించాలని పవన్ పేర్కొన్నారు. తిరుపతిలో వీఐపీ కల్చర్ పోయి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు.

డిప్యూటీ సీఎం పవన్ తిరుమలలో పరిస్థితుల పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటన లో తిరుమల అధికారులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. పోలీసులు రద్దీ నిర్వహణలో ఫెయిల్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీటీడీ ఈవో శ్యామలా రావు, ఏఈవో వెంకయ్య చౌదరి మధ్య సమన్వయ లోపం ఉందని కీలక వ్యాఖ్యలు చేసారు. టీటీడీలో ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేసారు. తిరుమలలో వరుసగా వైఫల్యాలు బయట పడుతున్నాయని చెప్పుకొచ్చారు. తాజా ఘటన పైన టీటీడీ బోర్డు వైఫల్యం ఉందన్నారు. బాధితులకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Dy CM Pawan Kalyan sensational comments over TTD Officials demands for Rshuffle

తిరుపతిలో తప్పు జరిగిందని పవన్ అంగీకరించారు. ఘటనలో మరణించిన వారి వద్దకు టీటీడీ బోర్డు సభ్యులు.. అధికారులు వెళ్లి వారికి క్షమాపణ చెప్పటంతో పాటుగా మద్దతుగా నివాల్సిన అవసరం ఉందని పవన్ సూచించారు. రద్దీని అదుపు చేయటంలో పవన్ విఫలమయ్యారని పవన్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని.. ఈ సందర్భంగా వారిద్దరికి పవన్ కల్యాణ్ సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+