విశాఖపట్నం వెళ్లే రైళ్లకు కేంద్రం గుడ్‌న్యూస్

విశాఖపట్నం మార్గంలో నడుస్తున్న రైళ్లకు అదనపు కోచ్ లు ఏర్పాటు చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లకు ఏసీ కోచ్ లతోపాటు స్లీపర్ కోచ్ లను పెంచింది. ప్రయాణికుల నుంచి డిమాండ్లు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖ- నాందేడ్ సూపర్ ఫాస్ట్, విశాఖ- అమృతసర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రస్తుతానికి అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సుదూర ప్రాంతాలకు నడిచే రైళ్లకు వీటిని ఏర్పాటు చేశారు.

విశాఖ‌ప‌ట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం- అమృతసర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైలుకు 3 ఏసీ ఎకానమీ కోచ్ లు, అదనపు స్లీపర్ క్లాస్ బోగీ శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల మూడో తేదీ నుంచి ఇది వర్తిస్తుంది.

east coast railway will add more coaches for two trains

అమృత్‌స‌ర్‌లో బ‌య‌లుదేరే అమృత్‌సర్-విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) రైలుకు 3 ఏసీ ఎకానమీ కోచ్ లు, అదనపు స్లీపర్ క్లాస్ బోగీ శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చాయి. వచ్చేనెల ఏడోతేదీ నుంచి ఇది వర్తిస్తుంది. ఈ రైళ్లకు స్లీపర్ 7 బోగీలు, థర్డ్ ఏసీ 4, సెకండ్ ఏసీ 1, ఎకానమీ 1, జనరల్ 4, దివ్యాంగులకు 1, ప్యాంట్రీకార్, జనరేటర్ మోటార్ కార్ ఉంటాయి.

విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరే విశాఖపట్నం- నాందేడ్ సూపర్ ఫాస్ట్ (20811) రైలుకు 3 ఏసీ ఎకానమీ కోచ్ లు, అదనపు స్లీపర్ క్లాస్ బోగీ శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చాయి. వచ్చేనెల మూడోతేదీన నుంచి ఇది వర్తిస్తుంది.

నాందేడ్‌నుంచి బ‌య‌లుదేరే నాందేడ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ (20812) రైలుకు 3 ఏసీ ఎకానమీ కోచ్ లు, అదనపు స్లీపర్ క్లాస్ బోగీ శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల నాలుగోతేదీ నుంచి ఇది వర్తిస్తుంది. ఈ రైలులో సెకండ్ ఏసీ1, థర్డ్ ఏసీ 4, ఎకానమీ 1, స్లీపర్ 7, జనరల్ 4, దివ్యాంగులకు 1, ప్యాంట్రీకార్ 1, జనరేటర్ మోటార్ కార్1 ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+