ఏపీ - తెలంగాణ ఎన్నికలకు ఈసీ సమాయత్తం, కీలక ప్రకటన..!!
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ గడువు 2024 జవనరి 16తో ముగియనుంది. ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్ 11తో ముగియనుంది. దీంతో..ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన మొత్తం తొమ్మది రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.
ఉమ్మడి గుర్తు కోసం:ఏపీ, తెలంగాణతో సహా తొమ్మది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తొలి అడుగు పడింది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ ఎలాట్ మెంట్) ఆర్డర్ 1968లోని పేరా 10-బిని అనుసరించి 2023-24 సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల జూలై 17, ఏపీఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబర్ 12 తరువాత దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఎన్నికల సంఘం ప్రకటన:లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబర్ 17 తరువాత దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. రానున్న ఏడాది కాలంలో తెలంగాణ, మిజోరం, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పార్లమెంట్ కు జూన్ 12, 2024తో గడువు ముగియనుంది. ఒక వేళ ఏదైనా అసెంబ్లీ గడువు ముుందుగానే రద్ద అయితే, ఆ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేసి అయిదు రోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. దీని ద్వారా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కామన్ సింబల్ కోసం రెండు ముఖ్యమైన పార్టీలు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఎలక్షన్ హీట్:ఏపీలో ఈ సారి ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నాయి. అధికారం తిరిగి నిలబెట్టుకోవటం కోసం వైసీపీ.. ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో జత కడుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలోనూ రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తోంది. అధికారం దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ప్రారంభించటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications