'ఇక్కడ చాలా జరుగుతాయి': పాస్ చేయిస్తానని.. రాసలీలలు, వీడియో తీశాడు
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం వెలుగు చూసింది. ఓ కోచింగ్ సెంటర్ కరస్పాండెట్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ రాసలీలలు జరుపుతున్నాడు.
ఈ సంఘటన రాజమహేంద్రవరంలో వెలుగు చూసింది. విద్యార్థులను పదో తరగతి పాస్ చేయిస్తానని చెబుతూ.. లొంగదీసుకుంటున్నాడు. ముఖ్యంగా పేద విద్యార్థులను అతను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడని తెలుస్తోంది. విద్యార్థునులతో జరిపిన రాసలీలలను రహస్య కెమెరాలతో చిత్రీకరించాడు.
వారు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోయారు. అయితే, కొందరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతని బండారం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

పాస్ చేయిస్తానని చెప్పి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వాటిని రహస్యంగా చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఇనిస్టిట్యూట్ విడిచిపెట్టాక.. వాడితో వారిని బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ లొంగదీసుకునేవాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా, విద్యార్థునుల పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కరస్పాండెంట్ పైన చర్యలు తీసుకోవాలని ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వారు మంగళవారం నాడు దక్షిణ మండల డిఎస్పీ శ్రావణికి కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతని తీరు తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు అంతకుముందే వెళ్లి ప్రశ్నించగా.. ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతాయని, మీరేం చేయలేరని కూడా అంతకుముందు నిందితుడు వ్యాఖ్యానించాడట.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications